తాజాగా తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది. సీఆర్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తులు భక్తుడు కనిపెట్టాడు. దీంతో టీటీడీ అలెర్ట్ అయ్యింది.
హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం షాపింగ్ చేశాడు. SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో స్టీల్ కడియం కొనుగోలు చేసారు శ్రీధర్. వసతి పొందిన గదికి వెళ్లి స్టీల్ కడియంను గమనించాడు శ్రీధర్. స్టీల్ కడియంపై అన్యమతం గుర్తు, పేరు ఉండటంతో అవాక్కైన భక్తుడు విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాడు. చైర్మన్ ఆదేశంతో స్పందించిన విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది భక్తుడిని వెంట తీసుకెళ్లి షాప్ లో తనిఖీలు నిర్వహించారు. షాపును తాత్కాలికంగా మూసివేసి విచారణ చేపట్టారు. మరోసారి అన్య మతానికి సంబంధించిన వస్తువులు తిరుమలలో బయటపడటం చర్చగా మారింది.