గణపయ్యకు 10 కేజీల విప్ప పువ్వు లడ్డూ.. మొక్కు చెల్లించుకున్న భక్తుడు

విప్పపువ్వు గిరిజనులు, ఆదివాసీలు ఎంతో ఇష్టంగా, పవిత్రంగా భావిస్తారు. ఈ విప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయి.. విప్ప పువ్వు సారా ను ఆదివాసీలు తమ ఇళ్లలో జరిగే వేడుకలు, పండుగల్లో తాగడం ఆచారంగా భావిస్తారు. వీటితో తయారుచేసే లడ్డూలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆదివాసీలు ఆరోగ్య రహస్యం లో విప్ప పువ్వు ముఖ్యమైనది. ఇప్పుడు ఇదే విప్ప పువ్వు తో తయారు చేసిన విప్ప పువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు ను గణపయ్య కు ప్రసాదంగా పెట్టారు భక్తులు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్ర పట్టణంలో యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి గణపయ్యకు 10 కేజీల విప్పలడ్డూను సమర్పించాడు పెడ్డిరెడ్డి అనే భక్తుడు. అనంతరం గణపతి మహారాజుకు దూపదీపనైవేద్యలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య వనవాసం చేసిన ఈ ప్రాంతంలో వైకుంఠ రాముడికి అత్యంత ప్రీతిపాత్రనైనది కూడా విప్ప ప్రసాదమే అని పర్యావరణ రహిత విగ్రంగా పేరొంది. 18 అడుగుల మట్టి గణపయ్యకు వాటర్ కలర్స్ తో సుందరంగా కొలువై పూజలందుకుంటున్న గణపతి మహారాజుకు విప్పాపువ్వు డ్రైప్రూట్స్ లడ్డు అందించి మొక్కును తీర్చుకున్నానని భక్తుడు తెలిపాడు.

About Kadam

Check Also

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *