ఇక్కడ ఉన్న చిత్రాలలో మీరు చూస్తుంది ఏమిటో గుర్తుపట్టారా.? వాటిని తీక్షణంగా చూడండి. అస్తిపంజరం చేయి.. అలాగే కాలులాగ కనిపిస్తున్నాయి కదా. కానీ అవి అస్తిపంజరం చేయి, కాలు కాదు.. కానీ అవి నేలలో నుంచే వచ్చాయి. సేద్యం చేస్తుంటే రైతులకు కనబడటంతో మొదట భయపడ్డారు. ఆ రైతులు తర్వాత వాటిని తీక్షణంగా చూసి హమ్మయ్యా అనుకున్నారు. ఇంతకీ అవేంటంటే.?
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ పొలాలలో రైతులకు కొన్ని అస్తిపంజరంలోని చేయి, కాలు లాంటి భాగాలు కనబడ్డాయి. మొదట వాటిని చూసి రైతులు ఇక్కడ ఏదో జరిగిందని గతంలో ఎవరినో చంపి పాతిపెట్టి ఉంటారేమో అనుకున్నారు. దానికి సంబంధించిన కాలు, చేయి భాగాలు అనుకున్నారు. కానీ వాటిని తీక్షణంగా చూసిన రైతులకు అవేంటో కానీ అర్థం కాలేదు. అవేంటంటే వింత ఆకారంలో వచ్చిన పుట్టగొడుగులు. పొలంలో సేద్యం చేస్తున్న రైతులకు అవి బయటపడటంతో ఒక్కసారిగా వారు కంగుతిన్నారు. కానీ వాటిని తీక్షణంగా పరిశీలించడంతో అవి పుట్టగొడుగులు అని తేలాయి.
ఇవి ఆ ఆకారంలో ఎందుకు వచ్చాయి అనే దానిపై మాత్రం ఎవరికీ తెలియని అంశమే. కానీ ఇడుపులపాయ, వేంపల్లి పరిసర ప్రాంతాలు కొండ ప్రాంతానికి దిగువన ఉంటాయి. అంతే కాకుండా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, వేముల పరిసర ప్రాంతాలలో ముగ్గురాయికి సంబంధించిన నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇలా పుట్టగొడుగులు వచ్చి ఉంటాయని, ముగ్గురాయి సారం ఎక్కువగా ఉన్న దగ్గర ఇలా తెల్లగా వస్తాయి అనేది అక్కడి స్థానిక రైతులు చెబుతున్న మాట. ఏది ఏమైనా ఇవి సడెన్‌గా చూస్తే మాత్రం అస్తిపంజరానికి సంబంధించిన వేళ్లు, కాలులాగ కనబడుతున్నాయి.