అనంతపురం కలెక్టరేట్‌లోనే DRO రమ్మీ ఆడుతూ కనిపించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న హాజరయ్యారు. అదే వేదికపై కనిపించారు DRO మలోల. ఓ వైపు అధికారులంతా సీరియస్‌గా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇంకోవైపు DRO మాత్రం తనకేం పట్టనట్లుగా రమ్మీ ఆడుతూ బిజీ బిజీగా గడిపారు డీఆర్వో మలోల. సమావేశం హాల్‌లో వందల మంది ప్రజలు. పదుల సంఖ్యలో అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు. అయినా.. తనపనిలో మునిగిపోయారు జిల్లా రెవెన్యూ అధికారి మలోల. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్.. విచారణకు ఆదేశించారు. వెంటనే వివరణ ఇవ్వాలని DRO మలోలకు నోటీస్ ఇచ్చారు.
Amaravati News Navyandhra First Digital News Portal