పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

కారంగా ఉంటుందని చాలా మంది పచ్చిమిర్చికి దూరంగా ఉంటారు. ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

పచ్చిమిర్చి ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అంటుంటారు. కానీ అది ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్‌, పొటాషియం, విటమిన్లు సి, ఎ, బి5 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజుకు రెండు నుంచి మూడు పచ్చి మిరపకాయలను భయం లేకుండా తినొచ్చని, ఫలితంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండిన మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలను వంటల్లో ఉపయోగించడం చాలా మంచిదని అంటున్నారు. ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అందువల్ల రోజుకు రెండు నుండి మూడు పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పచ్చి మిరపకాయల్లో బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, క్రిప్టోక్సంతిన్ వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఆహారంలో భాగంగా పచ్చి మిరపకాయలు తినడం ఉత్తమమని అంటారు. దీని వల్ల క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు. పచ్చి మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా, జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి పచ్చిమిర్చి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అని అంటారు. రోజుకు పరిమితికి మించి ఎక్కువగా పచ్చి మిరపకాయలు తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా తినకపోవడమే మంచిది.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *