ఇలా చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అయితే, మీరు కూడా మరీ బానిసలు కాకపోయినా అప్పుడప్పుడు మందు తీసుకుంటున్నారా..? అయితే, ఇది మీకు తెలుసా..? బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, మందుబాబులు మాత్రం ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్, మందు ఏదైనా సరే.. పెగ్గు గొంతులో పడకపోతే, ప్రాణం పోయినట్టుగా ఫీలవుతారు. ఇలా చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అయితే, మీరు కూడా మరీ బానిసలు కాకపోయినా అప్పుడప్పుడు మందు తీసుకుంటున్నారా..? అయితే, ఇది మీకు తెలుసా..? బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
వైన్, బీర్ కలిపి తాగడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. విభిన్న స్వభావం కలిగిన ఈ రెండు డ్రింక్స్ కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఇది మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. రెండింటినీ కలిపి తీసుకుంటే, వ్యక్తి చాలా త్వరగా మత్తులోకి వెళ్లిపోతాడని అంటున్నారు. చివరికి ఆలోచించే విచక్షణను కూడా కోల్పోతారని చెబుతున్నారు.
బీరు, వైన్ లేదా విస్కీ కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి పూట తాగి నిద్రిస్తే ఉదయాన్నే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, అది శరీరంలోని నీటిని బయటకు పంపుతుంది. విస్కీ, బీరు కలిపి తీసుకుంటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా ఛాతీలో మంట పెరుగుతుందని చెబుతున్నారు.. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. బీరు, విస్కీ కలిపి తాగడం వల్ల కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.