Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?

చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు మొదలు కొబ్బరి నూనె వరకు ఉపయోగిస్తుంటారు. అయితే చలికాలం రాగానే ఇలా చర్మం ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? చలికి చర్మం పగలడానికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వింటర్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువుతుంది. దీంతో చర్మంలో తేమ తగ్గిపోతుంది. ఈ కారణంగా చర్మం పగులుతుంది. అలాగే చలికాలంలో సహజంగానే నీటిని తక్కువగా తీసుకుంటాం. ఇది డీహైడ్రేషన్‌ సమస్యకు దారి తీస్తుంది. ఇక చలికారంణంగా వేడి నీటితో స్నానం చేస్తుంటం ఇది కూడా చర్మంలో సహజంగా ఉండే తేమ కోల్పోవడానికి కారణమవుతుంది. దీంతో చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయి.

వాతావరణంలోని చల్లని గాలి శరీరంలో ఉన్న తేమను పీల్చుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం బలహీనంగా మారడానికి కారణమవుతుంది. ఇక శరీరంలో విటమిన్‌ ఎ,సి,డి లోపం వల్ల కూడా స్కిన్‌ పగులుతుంది. వింటర్‌లో ఎండ తక్కువగా ఉండడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చెబుతుంటారు. ఇదండి చలికాలంలో చర్మం పగలడానికి కారణాలు. మరి ఈ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో సబ్బులకు బదులుగా శనగపిండిని ఉపయోగించాలి. శనగపిండిలో పాలు కలుపుకుని శరీరానికి అప్లై చేసుకుంటే చర్మం స్మూత్‌గా మారుతుంది. పెరుగులో తేనె కలుపుకొని చర్మానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మానికి నిగారింపు లభిస్తుంది. అధికంగా వేడి నీటితో స్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత చలిగా ఉన్న గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

About Kadam

Check Also

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *