గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుంది!

మారిన ఆహారపు అలవాట్లు, చేసే ఉద్యోగాల కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్‌తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు ఇది కూడా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది..

ఈ మధ్య కాలంలో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడుతున్నారు. పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ ట్రిక్ కూడా ట్రై చేస్తే.. ఖచ్చితంగా మీరు రిజల్ట్ పొందవచ్చు. ఎక్కువు సేపు కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చొని పని చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నలుగరిలో తిరగాలన్నా ఎంతో మంది బాధ పడుతున్నారు. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. వ్యాయామాలు చేస్తూ ఈ నీటిని తాగితే ఎలాంటి పొట్టలో అయినా మార్పు వచ్చి కరగడం పక్కా. దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నీటితో తాగలేక పోతే.. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

సబ్జాలు:

సబ్జాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బాడీని చల్లబరచడమే కాకుండా శరీరం లోపల పేరుకుపోయిన వ్యర్థాలను, చెడ్డు కొవ్వును కరిగిస్తుంది. సబ్జాలను ఉపయోగించి ఈ నీటిని తాగితే మరింత ఫలితం ఉంటుంది.

డ్రింక్ తయారీ విధానం:

ముందుగా సబ్జాలను ఓ అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసం, సబ్జాలు, తేనె కొద్దిగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ ఉదయాన్నే తాగితే మరింత ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటికి బదులు.. నిమ్మరసంలో తేనె, సబ్జాలు కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని సలాడ్స్‌లో కూడా ఉపయోగించి.. లేదా ఇతర జ్యూస్‌లలో కూడా కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

పొట్ట ఫ్లాట్‌గా మారాల్సిందే..

ఈ డ్రింక్ పొట్టలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఈ డ్రింక్ తాగిన నెలరోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. ఈ డ్రింక్ తాగుతూ వ్యాయామం చేస్తూ ఉంటూ, ఆరోగ్యకమైన ఆహారం తీసుకుంటే మంచి రిజల్ట్ అతి తక్కువ రోజుల్లోనే కనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్.. బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడేవారు ఈ చిట్కా తయారు చేయండి. ఈ డ్రింక్ తాగిన అరగంట వరకు ఎలాంటి టీ, కాఫీలు, ఆహారం తీసుకోకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

About Kadam

Check Also

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *