గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. దసరా పండుగ కోసం రాష్ట్రంలోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2, 2025 వరకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పండుగ సీజన్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ దసరా పండగ అక్టోబర్ 2, 2025 న వస్తుంది. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి.
విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి.
గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.