వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. ఈ సీజన్లో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది. కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినాలంటే ఇష్టపడరు. కానీ వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ఈ కాకరకాయ అతి ముఖ్యమైనది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కాకరకాయలో పుష్కలమైన ఔషధగుణాలు నిండివున్నాయని చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా కనిపిస్తాయి. కాకరకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాకరకాయలో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి, విసిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. ఈ సీజన్లో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
Amaravati News Navyandhra First Digital News Portal