బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!

బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా అందరి ఇళ్లలో బొద్దింకల బెడద వేదిస్తూ ఉంటుంది. కొందరి ఇళ్లలో బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే బొద్దింకల స్వైర విహారం మొదలవుతుంది. కానీ, వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే, ఇంట్లోంచి బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతుంటారు. సులభంగా బొద్దింకల నుంచి విముక్తి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బొద్దింకల నుంచి విముక్తి పొందడానికి ప్రతిరోజు ఇంట్లో బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార మూడింటిని బకెట్ నీళ్లలో కలిపి పిచికారి చేయండి. వారంలో ఇలా నాలుగు రోజులపాటు పిచికారి చేస్తే, బొద్దింకల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఇది పిచికారి చేయడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే బల్లులు కూడా తగ్గుతాయి.

బొద్దింకలను తరిమికొట్టడానికి బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకుల వాసన వల్ల బొద్దింకలు పారిపోతాయి. ఇందుకోసం కొన్ని ఆకులను తీసుకొని నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు, బొద్దింకలు ఎక్కడ కనిపించినా ఈ నీటిని చల్లుకోవాలి.. దీనివల్ల అవి పారిపోతాయి.

About Kadam

Check Also

కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స

నెలలు నిండని శిశువుకు గుండె సమస్యతో చికిత్స అవసరమైంది. కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్యులు అత్యాధునిక డివైస్ ఉపయోగించి శస్త్రచికిత్స …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *