ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఈ సమావేశంలో తీర్మానించనున్నట్టుగా తెలిసింది. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై ఈ సందర్భంగా తీర్మానం చేయనున్నారు.
ఇవాళ సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Amaravati News Navyandhra First Digital News Portal