రోడ్డుపై వెళ్తుండగా కనిపించిన తెల్లటి కవర్.. ఏముందా అని చూడగా.. అమ్మబాబోయ్

శ్రీశైల మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బులెట్స్ వెలుగు చూడడం కలకలం రేపింది. స్ధానిక వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో బులెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్. బాంబ్ స్క్వాడ్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్‌కు చెందిన ఐదు బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్‌కు చెందిన నాలుగు ఖాళీ బుల్లెట్లు, 9ఎం.ఎంకు చెందిన 4 బుల్లెట్లు గుర్తించారు. వీటితో పాటు నాలుగు బాంబులు కూడా లభించాయి.

నాలుగు వంకాయ బాంబులుగా అనుమానిస్తున్నారు. బుల్లెట్లు వెలుగు చూసిన ఘటనపై శ్రీశైలం పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. బుల్లెట్లతో పాటు ఒక ఎర్రగుడ్డ లభించడంతో నక్సల్స్ సంచారం ఏమైనా ఉందా.? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనుమానాస్పదంగా పెద్ద ఎత్తున బుల్లెట్లు లభించడం స్థానికంగా కలకలం రేపింది. అక్కడ బ్యాగు ఎవరు పెట్టారు.? అని ఎంక్వయిరీ చేస్తున్నారు శ్రీశైలం పోలీసులు.

About Kadam

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *