గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు.. కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టారు. అటు వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్టాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీస్ ఇచ్చారు పటమట పోలీసులు. ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిరోజుల కిందట ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్ హఠాత్తుగా పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది. సత్యవర్థన్‌ను బెదిరించడం వల్లే కేసు విత్‌డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరగబోతోంది. ఇదిలా ఉంటే.. ఇటు హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..
Amaravati News Navyandhra First Digital News Portal