కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..

హైదరాబాద్ పాతబస్తీలో అపెండిక్స్‌ ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో సర్ఫరాజ్‌ అనే యువకుడు చేరాడు. ఆ యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కాలం చెల్లిన సెలైన్‌తో పాటు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. దీంతో యువకుడి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆ యువకుడి ఆరోగ్యం చేయిదాటిపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులపై పలు అనుమానాలు వచ్చాయి. మందులపై దృష్టిపెట్టగా 9 నెలల క్రితమే కాలం చెల్లిన మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో ఆధారాలతో సహా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఆల్ఫా ఆస్పత్రిపై సంబంధిత అధికారులతో పాటు పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో యువకుడి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఎవరినీ గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ధన దాహానికి ఎందరో పేదలు బలైపోతున్నారు. అధిక బిల్లులు వసూలు చేయడం, బిల్లు కడితే తప్ప మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఆస్పత్రిలో మాత్రం కాసుల కక్కుర్తితో కాలం చెల్లిన మందులను రోగులకు ఇచ్చి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరు సరఫరా చేస్తున్నారో నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

About Kadam

Check Also

చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.. నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *