వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు. అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి.
కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దీంతో ఆ రైతు వజ్రాన్ని దిగుల చింతలకొండలో వేలానికి పెట్టారు. వేలానికి వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. కాగా, రైతు వజ్రాన్ని 18 లక్షల రూపాయిలకు అమ్ముతానని తెలిపారు. దీంతో వ్యాపారులందరూ సిండికేట్ అయి, 8 లక్షల రూపాయిలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతు ఎవరికీ అమ్మకుండా వజ్రాన్ని తన వద్దే ఉంచుకున్నాడని తెలిసింది.
చివరకు తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన కొత్త వ్యాపారి రూ.13 లక్షల 50 వేలకు కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. అయితే, ఇదే ఈ మధ్య కాలంలో దొరికిన ఖరీదైన వజ్రంగా స్థానికులు చెబుతున్నారు. వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు.
అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. వర్షాలు పడగానే కూలీలు, రైతులు, స్థానికులు వజ్రాల వేట సాగిస్తుంటారు.