నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మనం పుట్టక ముందు అంటే.. కోట్ల సంవత్సరాల క్రితం.. డైనోసర్ల కాలం మనుగడలో ఉండేది. ఆకారంలో భారీగా.. పెద్దవిగా ఉండే ఈ డైనోసర్ లాంటి జీవులు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల ఎక్కడొక చోట ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇక వాటిలా ఉండే ఓ జీవి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్‌స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతి పెద్ద పాముల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను సైతం అమాంతం మింగేసే సామర్ధ్యం వీటి సొంతం. ప్రస్తుతం ఆ తరహా పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన తర్వాత మీరు కూడా షాక్ కావడం ఖాయం. పొరపాటున అది ‘టైటానోబోవా’ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిజానికి అదొక భారీ సైజ్ అనకొండ. వీడియో చూస్తే మీ గుండెలు అదిరిపోతాయి.

స్థానికంగా ఉండే ఓ సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి.. అనూహ్యంగా తన గాలానికి ఇది చిక్కింది. బోలెడన్ని చేపలు చిక్కుతాయని అతడు భావించగా.. ఈ భారీ అనకొండ గాలంలో పడి గిలగిలలాడింది. ఇక దాని తోక పట్టుకుని లాగేందుకు ఈ వ్యక్తి ప్రయత్నించగా.. అది తప్పించుకునేందుకు చూసింది. అసలే భారీ సైజ్.. మనోడికి చిక్కుతుందా ఏంటి.?> అది అతడి చేతుల్లో నుంచి జారుకుని.. వేగంగా నీటిలో ఈదుతూ అడవి వైపుగా వెళ్లిపోయింది. కేవలం సినిమాల్లో చూడటమే తప్ప.. ఇంతటి పెద్ద అనకొండను ఎప్పుడూ చూసి ఉండరు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి. ఇది పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

About Kadam

Check Also

ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు

మన దేశంలో ఏ స్టేషన్‌లో చూసిన రైలు కరెక్ట్ టైంకి రావడం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. తరచూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *