చేపల వేటకు వెళ్లాడు.. కట్ చేస్తే.. వల బరువెక్కడంతో సరాసరి నీటిలోకే.. ఆ తర్వాత!

ఆ చేపను బోటులోకి లాగే ప్రయత్నం చేసిన యర్రయ్యను ఆ మత్స్యం బలంగా వెనక్కు లాగింది. దాంతో ఎర్రయ్య తాడుతో సహా సముద్రంలోకి పడిపోయాడు. ఆ సమయం వారంతా తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వేట సాగిస్తున్నారు. అంతలోనే సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. కానీ,

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక లో విషాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్ళిన మత్స్యకారుడిని ఒక చేప లాక్కెళ్ళిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఎర్రయ్య అనే మత్స్యకారుడు భారీ చేపను చూశాడు.. వెంటనే దాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పూడిమడక తీరం నుండి నలుగురు మత్స్యకారులు కలిసి సముద్రంలో వేటకు వెళ్లినట్టుగా తెలిసింది.

జాలర్లు నలుగురు సముద్రంలో వేట సాగిస్తుండగా గేలానికి భారీ కొమ్ముకోనాం చేప చిక్కింది. ఆ చేపను బోటులోకి లాగే ప్రయత్నం చేసిన యర్రయ్యను ఆ మత్స్యం బలంగా వెనక్కు లాగింది. దాంతో ఎర్రయ్య తాడుతో సహా సముద్రంలోకి పడిపోయాడు. ఆ సమయం వారంతా తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వేట సాగిస్తున్నారు. అంతలోనే సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. కానీ, అది చేతికందకుండా ఏకంగా ఎర్రయ్యను లాక్కెందంటూ.. తోటి జాలర్లు కన్నీటిపర్యంతమయ్యారు.

ఎర్రయ్య కోసం సముద్రంలో ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. గ్రామస్థులు పడవల్లో సాయంత్రం వరకు గాలించినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం నెలకొంది. తల్లి కోదండమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

About Kadam

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *