త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు.
అటు సర్కార్ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణ పై ఆయా పార్టీలతో SEC సమావేశంలో చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకోనుంది. అటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై చర్చించనుంది.
త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండవనే దానిపై చర్చించబోతున్నారు. దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారా.. ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల్లో సాధారణంగా ఏకగ్రీవాల హడావుడి కనిపిస్తుంటుంది. వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు- ఇలా చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
మరోవైపు నేడు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఈసీ సమావేశం కానుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై MCHRDలో కలెక్టర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది సర్కార్. ఇందుకు పంచాయతీరాజ్ అధికారు కసరత్తు చేస్తున్నాయి. న్యాయ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తులు తీసుకుంటున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal