ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాల తీసుకురావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ లేకుండా పొంతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కల్పించలేని, రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
కూటమి ప్రభుత్వంపై మరోసారి ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాల తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోందన్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. అదీ వీలుకాకపోతే, తమవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నంచేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోందని రాసుకొచ్చారు.
నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైసీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారిందని ఆయన్న అన్నారు. వాళ్ల బెదిరింపులకు భయపడకపోవడంతో.. రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైసీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుందన్నారు.
ఈ దాడులను చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూన్నారని ఆరోపించారు. ఆయన తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయని.. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను అంటూ ఎక్స్‌లో జగన్ రాసుకొచ్చారు.