వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడదియా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్‌పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్‌కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదన్నారు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.