గర్జించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు

రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని విమర్శించారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవ్వాలని అధినేత క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి మండలాల నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌రావు అందరు నేతలను కేసీఆర్‌కు పరిచయం చేశారు. తర్వాత.. ప్రభుత్వ పథకాల అమలు లోపాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. భూములు ధరలు అమాంతం పడిపోయాయన్నారు. మళ్లీ కరెంట్ కోతలు, నీళ్ల కరువు వచ్చిందని వ్యాఖ్యనించారు. గురుకులాల్లో అన్ని సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకి చూపించి మెడలు వంచుతామన్నారు కేసీఆర్. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతుబంధు ఆపలేదన్నారు. అలానే రైతుబీమా ద్వారా ఎంతోమంది అన్నదాతలకు మేలు జరిగిందన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ వాళ్లు గుణపాఠం చెప్పారని.. బీఆర్‌ఎస్‌ నేతలతో మీటింగ్‌లో కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పినా వినలేదని.. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని వ్యాఖ్యనించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు టెండర్లు ఎందుకు పిలవరు..  వాటిని అడ్డుకోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.  ఈ సందర్భంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని BRS క్యాడర్‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో బహిరంగా సభ పెట్టబోతున్నట్లు చెప్పారు.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *