అమెరికాలో ఉద్యోగం అనగానే లక్షలు అప్పజెప్పారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఉద్యోగాల పేరుతో ఎంతో మంది లక్షలు కాజేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం దాన్ని నమ్మి యువత పైసలు కట్టడం.. ఆ తర్వాత మోసపోయామని తెలిసి లబోదిబో అనడం. చివరకు పోలీసులను ఆశ్రయించడం. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా మోసగాళ్ల మాటలకు ఇంకా చాలా మంది బలవుతూనే ఉన్నారు.

ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగం అది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. వారి వద్ద నుండి రూ.37 లక్షలను వసూలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్ తెలియడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు కొరిటెపాడులో ఏవియేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2024లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అరండల్ పేటకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి ఆ సంస్థను సంప్రదించారు. దీంతో వారి వద్ద నుండి లక్ష రూపాయలను వివిధ ఫీజుల రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ ఇచ్చారని ఆరు నెలల పాటు అమెరికాలో ఉద్యోగం చేసిన తర్వాత వర్క్ ఫ్రం హోం చేయవచ్చని చెప్పారు. దీంతో వారి మాయ మాటలు నమ్మిన అక్కాచెల్లెళ్లు ఆ ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించడం మొదలు పెట్టారు.

ఆ ఉద్యోగాలకు అవసరమైన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్‌ను ఆ సంస్థ డైరెక్టర్ ఇప్పిస్తాడని నమ్మబలికారు. అమెరికాలో జాబ్ దరఖాస్తు కోసం 2500 డాలర్లు చెల్లించాలని చెప్పారు. వీసా, పాస్‌పోర్ట్‌కు ఇరవై లక్షల ఖర్చవుతుందని ఇతర అవసరాల కోసం మరో ముప్పై లక్షల అవసరం అవుతాయంటూ దశల వారీగా డబ్బులు కట్టించుకున్నారు. వీరి మాటలు నమ్మిక వాళ్లు డబ్బులు చెల్లించారు. ప్రతి నెల ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకునేవారు.

తిరిగి తిరిగి విసిగి వేసారిన అక్కా చెల్లెళ్లు అసలు ఏం జరుగుతుందని ఆరా తీశారు. అప్పుడు తమలాగే చాలామందిని మోసం చేసినట్లు తెలిసింది. తమ డబ్బులు తమకి తిరిగి ఇవ్వకుండే పోలీసులకు చెబుతామని హెచ్చరించడంతో 6.5 లక్షలను వెనక్కి ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్‌న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!

ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *