ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో వైఫై

ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై సదుపాయాలను అందించాలని ప్రైవేటు సంస్థ ప్రతిపాదించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా.. ముందుగా సెలక్ట్ చేసిన సినిమాలు, సాంగ్స్ వంటి కంటెంట్‌ను ప్యాసింజర్స్ తమ మొబైళ్లలో చూసేలా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వై-ఫై ద్వారా అందించే కంటెంట్ మధ్య అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని.. అందులో భాగస్వామ్యంతో ఆర్టీసీకి కూడా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ మధ్య మరో మీటింగ్ జరగనుంది. ఆ సమావేశం అనంతరం ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యచరణ రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుందని.. ప్రయాణికులు తక్కువ ధరలో వినోదాన్ని ఆస్వాదించగలరని భావిస్తున్నారు.

About Kadam

Check Also

దేశ పాలనకు గుండెకాయ.. కర్తవ్య భవన్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *