గేట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వాయిదా.. కొత్త షెడ్యూల్‌ చూశారా?

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 25 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ.

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 25 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఆగస్టు 28 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. అప్పటి నుంచి సెప్టెంబర్‌ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 9 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.2000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక గేట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులను జనవరి 2, 2025న విడుదల చేస్తారు. గేట్‌ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలకు మూడు గంటల పాటు ఉంటుంది. జరుగుతుంది. నెగటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు 33.33 శాతం మార్కుల కోత విధిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 చొప్పున మార్కుల కోత ఉంటుంది. గేట్‌ ఫలితాలు మార్చి 19, 2026న విడుదల చేస్తారు. స్కోర్‌ కార్డులను మార్చి 27 నుంచి మే 31వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గేట్‌ 2026 పరీక్షకు గరిష్టంగా రెండు పేపర్లకు రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్ధులు ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ఇందులో వచ్చిన స్కోరు పీజీ ప్రవేశానికి మూడు ఏళ్లు, పీఎస్‌యూల్లో నియామకానికి రెండేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీలో 13,217 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!

రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *