వామ్మో హడలెత్తిస్తున్న మరో వైరస్.. GBS వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయంటే..

గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆ మహిళకు సిండ్రోమ్‌ ఎలా సోకిందనే దానిపై వైద్య శాఖ ఆరా తీస్తోంది.. జీబీఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఇప్పుడు మరో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్.. GBS -కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దగ్గినా.. తుమ్మినా.. జ్వరం వచ్చినా సరే GBS అటాక్‌ అయిందా? అని హడలిపోయేలా మారింది పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ పాజిటివ్‌ కేసులు రిజిష్టరయ్యాయి. తాజాగా తెలంగాణాలో GBS డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పేషెంట్‌‌కు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

అయితే.. గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు

కలుషిత ఆహారం.. బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బారే సిండ్రోమ్‌ సోకుతుంది. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

ఈ వైరస్‌ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్‌, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రజలు జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

ఒకట్రెండు వారాల్లోనే..

అత్యధిక శాతం మందిలో ఇన్‌ఫెక్షన్‌ మొదలైన ఒకట్రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్‌ఫ్లూయెంజా, టెటనస్‌ టీకాల వంటివి కూడా గులియన్‌ బారీ సిండ్రోమ్‌కు దోహదం చేయొచ్చని అంటున్నారు డాక్టర్లు.. కరోనాలా ఇది అంటువ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా వుండాలి. డాక్టర్లు చెప్పినట్టుగా వైరస్‌ లక్షణాలు కన్పిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.

సకాలంలో వైద్యం అందితే..

మహారాష్ట్రలో ఇప్పటికే 130కిపైగా గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇద్దరు చనిపోయారు కూడా . సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు. వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినా .. ఆలస్యం జరిగితే అనర్ధం తప్పదంటున్నారు నిపుణులు .వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే.. కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు, . బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

బయట తినడం మానుకోండి

జీబీఎస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. AIIMS న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ బయట తినడం మానుకోవాలని సూచించారు.. కలుషితమైన ఆహారం, నీటి వల్ల కలిగే గ్యాస్ట్రోఎంటెరిటిస్, గ్విలియన్-బారే సిండ్రోమ్‌కు కారణమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెహ్రావత్ ప్రజలు బయట తినడం మానుకోవాలని.. ఆహారం, నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

About Kadam

Check Also

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *