అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు విద్యార్థి.. షికాగోలో కాల్చి చంపిన దుండగులు!

అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.

అమెరికాలో భారతీయులపై దారుణాలు ఆగడంలేదు. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా దుండగులు చేతిలో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు.

రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల కుమారుడు సాయితేజ 4 నెలల క్రితం ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లారు. చదువుతోపాటు షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(నవంబర్ 29) రాత్రి ఒంటిగంట ప్రాంతంలో సాయితేజపై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్‌లోని నగదుతో పారిపోయారు. దుండగులు కాల్పుల్లో నుకారపు సాయితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చదువుకుంటూ చికాగోలో స్టోర్‌లో సాయితేజ పని చేస్తున్నారు. తల్లిదండ్రులకు భారంగా కాకుండా ఉండాలనుకున్నాడు. ఇంతలోనే అనుకోని ఘటనతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోతోంది.

కోటేశ్వర రావు, వాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లింది. యూఎస్‌లోనే ఉన్నత చదువులు చదువుతోంది. 4 నెలల క్రితం కుమారుడు సాయితేజను సైతం ఉన్నత చదువుల కోసం పంపించారు. అయితే ఒక్క కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బందువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తేజ నివాసానికి చేరుకుని తల్లి తండ్రులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి ఫోన్ లో కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయితేజ భౌతికకాయాన్ని త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *