టెక్నలాజియా..! వాటర్ టిన్‌లతో గోదావరిలో చేపల వేట.. చూస్తే అదుర్స్ అంటారంతే..

చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు.. వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి.. ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి.. అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు, చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం.. కానీ గోదారోళ్ళు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంభిస్తున్నారు. చేపలు ఏదైనా పాత్రలోకి ముందుకు వెళ్లడం తప్ప వెనక్కు తిరిగి రావు అన్న విషయాన్ని పసిగట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత వాసులు.. చేపలు పట్టడంలో నూతన పద్దతిని ప్రారంభించారు.

ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ టిన్‌లను అడుగున కట్ చేసి దానికి తాడు కట్టి.. ఆ డబ్బాలో వరి పిండి ముద్దగా చేసి పెట్టి గోదావరిలోకి విసురుతున్నారు.. అయితే.. వరిపిండి తినేందుకు డబ్బాలోకి వచ్చిన చేప వెనక్కు తిరిగి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక పోవడంతో కొట్టుకుంటుంది. అలాంటి సమయంలో.. తాడు నీటిలో ఇంకొంచె లోపలికి వెళ్తుంది.. ఈ క్రమంలోనే డబ్బాను తాడు సహాయంతో ఒడ్డుకు లాగుతున్నారు.

ఈ కొత్త టెక్నాలజీలో చేపలు బాగా పడుతుండటంతో నరసాపురం గోదావరి తీరంలో.. వందలాది మంది ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టేందుకు ఎగబడుతున్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో కొయింగులు జాతికి చెందిన చాపలు విరివిగా పడుతున్నాయి.. దీంతో వాటిని డబ్బాల సహాయంతో పట్టి కేజీ రూ.500 చొప్పున అమ్ముతున్నారు. ఇవి గోదావరిలో దొరకడం.. తాజాగా ఉండటం, బ్రతికున్న చేపలు దొరుకుతుండటంతో వీటిని కొనేందుకు చేపల ప్రియులు ఎగబడుతున్నారు.

అంతే కాదు డబ్బాలతో చేపలు వేటను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. మొత్తానికి నూతన వరవడిని సృష్టించడంలో గోదారోళ్ళు ముందు ఉంటారని నిరూపించారు నరసాపురం ప్రాంత మత్స్యకారులు.. ఏదైమైనా ఈ టెక్నాలజీ అదుర్స్ అంటున్నారు..

About Kadam

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *