పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

మగువలు పసిడి ప్రియులు. పండగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో గోల్డ్‌ కొనలేని పరిస్థికి వచ్చింది. కానీ బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) స్పష్టం చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే మరింతగా దిగొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు శుభశూచకంగా మంగళవారం (జులై 16) బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ49 తగ్గడంతో.. రూ.9,928 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.45 తగ్గింది. ప్రస్తుతం గ్రాము ధర రూ.9,100గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.37 తగ్గి.. రూ.7,446వద్ద కొనసాగుతుంది.

బులియన్‌ మార్కెట్లో మంగళవారం (జులై 16) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.99,280 (రూ.490 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,000, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,460 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,280, 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,000, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,460గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,280, 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,000, 18 క్యారెట్ల బంగారం తులం రూ.75,000గా ఉంది. గుంటూరులో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.99,280, 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,000, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,460గా ఉంది. మిగతా అన్ని నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా తగ్గాయి. కేజీ వెండికి ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.1,14,000కు చేరుకుంది. చెన్నైలో కిలో వెండి రూ.1,24,000, కలకత్తాలో రూ.1,14,000, హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,24,000 వద్ద కొనసాగుతుంది.

About Kadam

Check Also

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?

పన్ను శాఖ మీ ఇంట్లో నగదును కనుగొంటే, దాని మూలాన్ని వెల్లడించలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *