24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బాబోయ్ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర 100 గ్రాములకు రూ. 30,000 కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఇటీవలి నెలల్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలలో ఒకటి అని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. వచ్చే సీజన్‌కు ముందు ఎక్కువ మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. అంతేకాదు.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,100లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,260లుగా ఉంది. 18 క్యారెట్లతో ఉండే 10గ్రాముల బంగారం ధర రూ. 79,580లు పలుకుతోంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,06,250లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,410లుగా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,06,100లుగా ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.97,260 ఉంది.
– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,06,100ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.97,260 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,06,100లు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.97,260 గా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,06,100 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.97,260 లుగా ఉంది.
– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,06,100 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.97,260 లుగా ఉంది.
ఇక, ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. పసిడితో పాటుగానే వెండి కూడా పరుగులు పెడుతోంది. వెండి గ్రాము ధర రూ.136.20లు ఉండగా, కిలో వెండి ధర రూ. 1,36,200లు ధర పలుకుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.