నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి.. ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కాలేజీల్లో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో పలువురు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ రవీంద్ర నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్‌ కళాశాలల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ నర్సెస్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ సంఘం ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ సభ్యులు డిసెంబరు 17న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ రవీంద్ర నాయక్‌కు కలిసి, ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇందులో వారు పలు అంశాలను ప్రస్తావించారు.

నర్సింగ్‌ స్కూళ్లలో మాత్రమే అబ్బాయిలకు అడ్మిషన్లు కల్సిస్తున్నారని, నర్సింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు ఇవ్వడం లేదని తెలిపారు. అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నర్సింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతోపాటు ఎమ్మెస్సీ నర్సింగ్‌ అధికారుల పదోన్నతుల ప్రొవిజినల్‌ జాబితాలో అర్హులైన అధికారుల పేర్లు రాలేదని వినతి పత్రంలో ప్రస్తావించారు. అందులోని తప్పిదాలను కూడా సవరించి.. వీలైనంత త్వరగా అర్హుల జాబితాను మరోమారు విడుదల చేయాలని కోరారు. అలాగే త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కూడా కలిసి సమస్యలను వివరిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ మైనర్‌ మాధ్యమాల పాఠ్యపుస్తకాల రూపకల్పన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మైనర్‌ మాధ్యమాలకు పాఠ్యపుస్తకాలు రూపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇందుకోసం డిసెంబరు 19 నుంచి 21 వరకు కార్యశాల నిర్వహించనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాల రూపకల్పనకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులంతా కార్యశాలకు హాజరయ్యేలా చూడాలని జిల్లా విద్యాధికారులను సమగ్ర శిక్ష అభియాన్‌ ఆదేశించింది.

About Kadam

Check Also

వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *