ఇది కదా పండగంటే.. సామాన్యులకు బంపర్ బొనాంజా.. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ ఎంత తగ్గిందంటే..

దసరా, దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్‌ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నిజం చేస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఐదు శాతం, రెండోది 18శాతం. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. సగటున ఓ కుటుంబానికి చూస్తే.. కనీసం 1500 నుంచి 2000 వరకూ ఆదా అవుతుందనే అంచనాలున్నాయ్‌.. ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల విషయంలో మనకు బెనిఫిట్స్‌ ఎలా ఉండబోతున్నాయో చూడండి..

మనకు బెనిఫిట్స్‌ ఎలా ఉండబోతున్నాయో చూడండి..

  1. నిత్యావసర వస్తువులపై 18శాతం ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గించింది కేంద్రం. హెయిర్‌ ఆయిల్‌, టూత్‌పేస్ట్‌, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షేవింగ్ క్రీమ్ ధరలు భారీగా తగ్గనున్నాయి.
  2. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ-ప్యాకేజ్డ్‌ నమ్‌కీన్‌, మిక్చర్, వంట సామగ్రి, పాలసీసాలు 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించింది కేంద్రం
  3. ప్యాకేజ్డ్‌ చపాతీ, రోటి, పరోటా.. డ్రై ఫ్రూట్స్‌ అండ్‌ నట్స్‌, సీ-ఫుడ్‌, ఐస్‌క్రీమ్స్‌, ఫ్రూట్‌ డ్రింక్స్‌ కూడా 12 నుంచి 5 శాతానికి తగ్గనున్నాయి
  4. బేకరీ ఉత్పత్తులు, పన్నీర్‌-చెనా, సాస్‌ అండ్‌ సలాడ్స్‌, జామ్ అండ్‌ జెల్లీస్‌, ప్లాంట్‌ బేస్డ్‌ మిల్క్‌ , భుజియా అన్నింటిపై 12 నుంచి 5శాతం జీఎస్టీకి తగ్గాయి.
  5. వ్యవసాయం రంగానికి ఉపయోగించే వస్తువులపై 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గించింది కేంద్రం. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయో పెస్టిసైడ్స్‌, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు అన్నీ 12 నుంచి 5శాతానికి వచ్చాయి. వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది.
  6. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీ నుంచి జీరోకు తీసుకొచ్చారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి జీఎస్టీ అనేది ఉండదు.
  7. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నొస్టి్క్ కిట్‌లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లు లాంటి వాటిపై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారు. దీనివల్ల హాస్పిటల్ బిల్లులు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది.
  8. వాహనరంగంలో.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గించింది కేంద్రం.
  9. పెట్రోల్, పెట్రోల్‌ హైబ్రిడ్‌, 1200 సీసీలోపు ఉన్న LPG, CNG కార్లపై GST 28 నుంచి 18 శాతానికి తగ్గనుంది.
  10. ఇక డీజిల్‌, 1200 సీసీలోపు ఉన్న డీజిల్‌ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్‌ కూడా 18 శాతానికి తగ్గుతాయి.
  11. 350 CC వరకు ఉన్న బైక్‌లు, మినీలారీలు, DCMలు ట్రాలీఆటోలపై జీఎస్టీ 18 శాతానికి తగ్గనున్నాయి
  12. ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాల విషయానికి వస్తే..32 అంగులాలకు మించిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లపై 28 నుంచి 18శాతానికి జీఎస్టీ తగ్గింది.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *