హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు..
యేటా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు, అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ (జనరల్ అండ్ ప్రొఫెషనల్) కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందించే ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్’ ప్రోగ్రామ్ 2025-26కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా 1 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆధాయం 2.5 లక్షలకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 4, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధుల అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఏ తరగతికి ఎంతెంత స్కాలర్‌షిప్ అందిస్తారంటే..
- 1 నుంచి 6వ తరగతి వరకు రూ.15,000
- 7 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.18,000
- జనరల్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్ధులకు రూ.30,000
- ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్ధులకు రూ.50,000
- జనరల్ పీజీ కోర్సులు చదివే విద్యార్ధులకు రూ.35,000
- ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదివే విద్యార్దులకు రూ.75,000
Amaravati News Navyandhra First Digital News Portal