సపోటా పండు ఇష్టపడని వారంటూ ఉండరనే చెప్పాలి. భిన్నమైన తీపి రుచితో ఉండే ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి. ముఖ్యంగా ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా మన దేశం పండు కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది స్పెయిన్‌కు చెందినది. ఈ చెట్లు మధ్య అమెరికాలో పుష్కలంగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారని సమాచారం. చలికాలంలో సపోటా లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
శీతాకాలంలో తరచూ సపోటా తింటే చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పుష్కలంగా శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది. సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. రాత్రి పూట నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల సుఖంగా నిద్రపోతారు. సపోటా పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది. సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. రాత్రి పూట నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల సుఖంగా నిద్రపోతారు. సపోటా పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.
అధిక బరువు తగ్గడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో వచ్చే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో అనేక విధాలుగా సపోటా పండ్లు సహాయపడతాయి. సపోటాలో లభించే విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి.
సపోటాలో రక్తస్రావ నివారిణి, విరేచన నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది తింటే రక్తస్రావం ఆగిపోతుంది, పైల్స్, విరేచనాలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సపోటాలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. సపోటాలో యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నాయి. ఇవి వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.