వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. ఇవగో పూర్తి డీటేల్స్..

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గమార్చారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కరీంనగర్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, కాచిగూడ–మెదక్‌, మెదక్‌–కాచిగూడ, బోధన్‌–కాచిగూడ, ఆదిలాబాద్‌–తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌–కాచిగూడ రైలు రద్దు కానుంది. మహబూబ్‌నగర్‌–కాచిగూడ, షాద్‌నగర్‌–కాచిగూడ రైళ్లను కొంత దూరం వరకే నడిపి పాక్షికంగా రద్దు చేశారు.

కామారెడ్డి–బికనూర్‌–తలమడ్ల, అకన్పేట్‌–మెదక్‌ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు ఎలా మారతాయో బట్టి రద్దయే, దారిమార్చే రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది. కాచిగూడ: 9063318082, నిజామాబాద్: 970329671, కామారెడ్డి: 9281035664, సికింద్రాబాద్: 040–27786170 నంబర్లకు కాల్ చేసి.. రైళ్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

About Kadam

Check Also

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *