బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి.. ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం శనివారం 13 సెప్టెంబర్ 2025 IST 0830 గంటలకు విస్తరించి కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మట్టం ఎత్తుతో నైరుతి దిశగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉన్నది. ఈ అల్పపీడనము రాగల 2 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని.. అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు శ్రీ గంగానగర్, రోహ్తక్, సియోని, రాజ్నందగావ్ – అక్కడి నుండి పశ్చిమ మధ్య – దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా అల్పపీడన ప్రాంతం కేంద్రము గుండా వెళుతుంది.
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా నున్న అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ మహారాష్ట్ర వరకు ఛత్తీస్‌గఢ్ – విదర్భ వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 – 5.8 కి.మీ మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశ వైపునకు వంగి ఉంటుంది..
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-