వర్షకాలం వచ్చేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్యనిపుణులు. అయితే వర్షాకాలంలో అస్సలే ఐదు ఆహారపదార్థాలు తినకూడదంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షకాంలో స్ట్రీట్ ఫుడ్ అస్సలే తినకూడదంట. బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు వంటివి, అలాగే పానీపూరి అస్సలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్ తినడం వలన కడుపులో ఇన్ఫెక్షన్స్, వచ్చి కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయంట. అందుకే స్త్రీట్ ఫుడ్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.
సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ డి,సి వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని వర్షకాలంలో ఎక్కువగా తినకూడదంట. ముఖ్యంగా కట్ చేసి అమ్మేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షకాలంలో ఎక్కువగా కలుషితం అవుతాయంట. దీని వలన అనేక సమస్యలు వస్తుంటాయి. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలంట.
కొంత మందికి పెరుగు, మజ్జిగ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారు సీజన్‌తో పని లేకుండా పెరుగు, మజ్జిగా ఎక్కువ తింటుంటారు. అయితే వర్షకాలంలో పెరుగు లేదా మజ్జిగా ఎక్కువగా అస్సలే తీసుకోకూడదంట. ఎక్కవ మోతాదులో తీసుకోవడం వలన కడుపులో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందుకే వర్షకాలంలో పెరుగు, మజ్జిగా మితంగా తీసుకోవాలంట.
వర్షకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉండే కార్బోనేటెడ్ డ్రిక్స్ వర్షకాలంలో ఎక్కువగా తాగడం వలన అనేక సమస్యలు వస్తాయంట. ముఖ్యంగా జీర్ణసంబంధ వ్యాధులతో సతమతం అవ్వాల్సి ఉంటుందంట. అందుకే వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకూడదంట.
వర్షాకాలంలో చాలా మంది టీ, కాఫీస్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ శరీరానికి వెచ్చదనం ఇస్తుందని వీటిని ఎక్కువగా తాగడం వలన ఇది కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.