ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే కార్యకర్తలు..
అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులతో బందోబస్తు. సభకు హాజరయ్యేందుకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు బయలుదేరారు.
మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు సీఎం చంద్రబాబు అనంతపురం చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి… పుట్టపర్తి నుంచి అనంతపురం కు హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురం చేరుకోనున్నారు. మూడున్నర లక్షల మందితో భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటనతో భాగంగా నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు.