భువనేశ్వరి, బ్రాహ్మణి సంపాదిస్తుంటే.. నేను, లోకేష్ రాజకీయాలు చేస్తున్నాం..

నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారంటూ జ్యూరిచ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. నిత్యస్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే..ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని ఒకటి రెండుసార్లు విఫలం అయినా హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. …

Read More »

Bank Holiday: జనవరిలో ఆ రోజు కూడా సెలవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రోజు సెలవు ఇచ్చింది. కనుమ పండుగను కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలోని బ్యాంకు ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మాత్రమే సెలవు ఇచ్చారు. డిసెంబర్‌లో విడుదల చేసిన 2025 ప్రభుత్వ సెలవుల జాబితాలో.. ఏపీలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14 మాత్రమే సెలవు ఇచ్చారు, అయితే జనవరి 15న అంటే కనుమ రోజు …

Read More »

సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్

Chandrababu: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం తమ సొంత గ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న చంద్రబాబు కుటుంబం.. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, ఉత్సవాలు చూసేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో 33కేవీ సెమీ …

Read More »

నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు పోటెత్తిన భక్తులు

Sabarimala: అయ్యప్ప స్వామి వార్షిక ఉత్సవాల్లో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం ఆసన్నం అయింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని కళ్లారా చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాల్లో …

Read More »

సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ.. బుల్లి రాజే హైలెట్

సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి, వెంకటేష్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రమోషన్స్, ఆ హంగామా అందరికీ తెలిసిందే. ఇక వద్దురా బాబు.. వదిలేయండి.. కచ్చితంగా సినిమా చూస్తాం.. మీ ప్రమోషన్స్ చూడలేకపోతోన్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టే దాక పరిస్థితి వచ్చింది. అయితే అనిల్ రావిపూడి మీద ఓ ముద్ర ఉంది. పాత కథనే అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక కామెడీ ట్రాక్ పెట్టించి ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంటాడన్న మార్క్ అయితే ఉంది. అందుకే ఎంత ట్రోలింగ్ జరిగినా …

Read More »

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఈ పర్యటన జరగవచ్చని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.రష్యా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారత్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2025 ఫిబ్రవరిలో …

Read More »

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని పవన్ …

Read More »

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త.. సంక్రాంతి ముందే వచ్చేసిందిగా

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త. సంక్రాంతి ముందే వచ్చేసిందని చెప్పొచ్చు. జనవరి 11 నుంచి విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. 20833-34 నెంబర్ గల విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం 16 కోచ్‌లతో 1,128 ప్యాసింజర్ల సామర్థ్యంతో సేవలు అందిస్తుండగా.. రేపటి నుంచి అనగా జనవరి 11న ఈ ట్రైన్ 1,414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్‌లతో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం 16 కోచ్‌లు ఉన్న ఈ వందేభారత్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, …

Read More »

ఫార్ములా-E రేస్‌ కేసు విచారణలో ఉత్కంఠ.. BLN రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఏసీబీ

ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ టాప్ గేర్‌లో నడుస్తోంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందుతులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మొన్న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ఇవాళ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏసీబీ విచారించింది.మొన్న ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌, నిన్న కేటీఆర్‌.. ఇవాళ బీఎల్‌ఎన్‌ రెడ్డి. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్‌ స్పీడందుకుంది. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఇంటరాగేషన్‌.. ఇంటర్‌ …

Read More »

మీరూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. తిరుపతి ఘటనపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి ఘటనకు బాధ్యత వహిస్తూ తాను ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టీటీడీ ఈవో సహా అధికారులందరూ బాధితులకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కొందరు అధికారులు పని చేయడం మానేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు.తప్పు ఎవరిదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది కాబట్టే.. తిరుపతి ఘటనపై తాను క్షమాపణలు అడిగానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు.. ఈవో, ఏఈవో క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఏంటని …

Read More »

 బాబోయ్.. మళ్లీనా.. ఏపీలో ఈ ప్రాంతాలకు మోస్తరు వానలు.. తాజా వెదర్ రిపోర్ట్

నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అనగా శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ఈరోజు:- తేలికపాటి …

Read More »

భారతదేశపు అత్యంత చౌకైన ఏసీ రైలు.. కి.మీ కేవలం 68 పైసలే..!

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ఈ ఒక్క ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. భారతీయ రైల్వే రైళ్లలో టికెట్ ఛార్జీలు కోచ్, సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. స్లీపర్, జనరల్ కోచ్‌లతో పోలిస్తే AC కోచ్‌ల ఛార్జీలు ఎక్కువ. AC కోచ్‌లో ఏసీ రైళ్ల ఛార్జీలు స్లీపర్ కంటే రెండింతలు …

Read More »

రూ.9 లక్షలు ఖర్చుపెట్టి సొంతూరులో స్కూల్ కట్టించాడు.. ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు!

పుట్టిపెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరే దానిని నెరవేర్చుతారు. అలాంటి వ్యక్తే నవీన్ గుప్తా. ఏళ్లుగా ఊరిలో ప్రభుత్వ బడి సరైన భవనం, సదుపాయాలు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడటం చూసి.. సొంత ఖర్చుతో స్కూల్ కట్టించడానికి ముందుకు వచ్చాడు. అంతేనా.. చకచకా స్కూల్ నిర్మాణం కూడా పూర్తి చేశాడు.. ఉన్న ఊరుకి ఎదో ఒకటి చేయాలని అందరు అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే ముందుకు వచ్చి గ్రామానికి ఉపయోగపడే పని చేస్తారు. వారు చేసే పని తరతరాలు …

Read More »

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఇలానా.. సీఎం ఫోటోను అలా చేసింది ఎవరు..?

ఎంతటి లెక్కలేనితనం.. ఎంతటి నిర్లక్ష్యం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఇలాంటి సీన్.. నిజంగా స్ట్రిక్ యాక్షన్ తీసుకోవాల్సిందే. యువత మత్తుకు బానిస కాకుండా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్‌లో సీఎం ఫోటోను అసభ్యంగా ఎడిట్ చేశారు పెట్టారు దుండగులు. ఇలా ఎవరు చేశారో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.. గంజాయి మూలాలను కూకటి వేళ్ళతో పెకిలిస్తోంది.. అందులో భాగంగానే నార్కోటిక్ అధికారులు ప్రజలను చైతన్య పరుస్తూ చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. …

Read More »

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్

సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…డ్రై పోర్ట్ ఏర్పాటు తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఫోర్త్ …

Read More »