స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మరో రెండు రోజుల్లోనే జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన కమిషన్.. తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లాగిన్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అడ్మిట్ …
Read More »కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ …
Read More »ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్
ఏపీ, తెలంగాణలో ఓ వైపు పొలిటికల్ మెరుపులు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైందో చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణశాఖ. వర్షాకాలం వచ్చిందన్నమాటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సరైన వర్షాలు పడలేదు. దీంతో నారుపోసి, నాట్లు వేసిన అన్నదాతలు పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వానజాడకోసం ఆకాశంవైపు చూస్తూ వరుణుడిని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ అధికారులు రైతన్నలకు …
Read More »వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూల్స్‌కు కూడా భారీగా ఫీజులను పెంచేస్తున్నాయి. కేవలం నర్సరీకే లక్షల్లో ఫీజులు వస్తూ చేస్తున్నారు. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తోకకొస్తుంది. అంతో ఇంతో సంపాదన ఉన్న వాళ్ల పరిస్థితి కాస్తా ఒకే అనుకున్నా.. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా మారింది.. తాము కష్టపడి సంపాధిండే డబ్బులు మొత్తం పిల్లల స్కూలు ఫీజులకే సరిపోతుంది. …
Read More »ఒక్కసారిగా పోస్టాఫీస్‌కు మహిళలు క్యూ.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
వికారాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పరిగిలోని స్థానిక మహిళలు ఒక్కసారిగా పోస్టాఫీసు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే భాగ్యలక్ష్మీ స్కీం ద్వారా రూ. 2,500 నగదు జమ అవుతోందని స్థానికంగా వదంతులు రావడంతో.. వందలాది మహిళలు ఆ డబ్బులు తీసుకుందామని.. పోస్టాఫీసులో అకౌంట్‌లు తెరిచేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లల్ని సైతం పట్టుకుని లైన్‌లో నిల్చున్నారు. అయితే ఇదంతా వట్టి పుకార్లు మాత్రమేనని.. భాగ్యలక్ష్మీ స్కీంకు సంబంధించిన ఎలాంటి సర్క్యూలర్ కూడా తపాలాశాఖకు రాలేదని.. …
Read More »రాష్ట్రానికి మరో మణిహారం.. యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం!
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపమైంది. దీంతో విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువనుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవతరించింది. దేశ విద్యుత్ రంగానికి దేశానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. గత ఏడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి, …
Read More »బనకచర్లతో తెలంగాణకు ఇబ్బందేంటీ..? జగన్ వల్ల ఏపీ పరువు పోయింది – లోకేశ్
కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్రే బనకచర్ల ప్రాజెక్టుపై జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. సింగపూర్ పర్యటన విజయవంతమైందని.. దాని ఫలితంగా వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాము ఎంవోయూలు దగ్గర ఆగిపోలేదని.. ప్రతీ ఒక్కదాన్ని నేరుగా కార్యరూపంలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. జూమ్ కాల్ ద్వారా …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు మరో మలుపు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో మొదటి నుంచి దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. దర్యాప్తు నిలిచిన దశ నుంచి కొనసాగించాలని సూచించింది. సిట్ అధికారులు విచారమ ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించినవారిపై సిట్ ఫోకస్ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తదుపరి దర్యాప్తు పేరుతో మళ్లీ …
Read More »కలల్లో ఉండడం కాదు.. వాస్తవంలోకి రండి.. ప్రతిపక్షాలపై మంత్రి లోకేష్ ఫైర్!
పోయింది, ఏపీ పరపతి పోయింది. అంతా జగనే చేశారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలను అనుమానించడమే కాకుండా అవమానించారు. అవినీతి ముద్రవేసి వాళ్లను ఏపీ నుంచి వెళ్లగొట్టారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నారా లోకేష్. అప్పుడు అవినీతి మాటలతోనూ.. ఇప్పుడు మెయిల్స్‌తోనూ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సింగపూర్ టాక్స్‌లో మరెన్నో కీలక విషయాలు లోకేష్ వెల్లడించారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందన్నారు మంత్రి నారా లోకేష్. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో …
Read More »ఏపీ సర్కార్ గొప్ప మనస్సు.. వారికి కూడా పెన్షన్.. ఎందుకు ఇస్తున్నారంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన భార్యకు.. ఇకపై …
Read More »ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోండి..
అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్ ఇక్కడ తెలుసుకుందాం… రిజర్వ్ బ్యాంక్ …
Read More »కన్న కూతురునే చెరపట్టాలని చూసిన కసాయి తండ్రి కేసులో కోర్టు సంచలన తీర్పు..!
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై ఏళ్ళ క్రితమే పెళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లులు ఉన్నారు. ముగ్గురు పిల్లల తర్వాత భార్యాభర్తల మద్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తను విడిచిపెట్టి భార్య వెళ్లిపోయింది. అయితే ముగ్గురు ఆడపిల్లల్లో చిన్న కుమార్తె ఐదో తరగతి చదువుతూ తండ్రే వద్ద నివసిస్తుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై …
Read More »కంత్రిగాళ్ల పని ఖతం.. రంగంలోకి ఖాకీల త్రినేత్రం!.. కంట పడ్డారో మీపని గోవిందా!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థను అప్‌డేట్ చేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. సమాజంలోకి ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇలానే ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఏలూరు జిల్లా పోలీసులు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడిని పట్టుకున్నారు. జిల్లాకు చెందిన పాత నేరస్థులను పట్టుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేరస్థులను గుర్తించేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్‌రికగ్నిషన్ ఫీచర్ కలిగిన సీసీ కెమెరాలను …
Read More »నేటి నుంచి శ్రీవారి దర్శనం మరింత సులభం..! ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్‌ను …
Read More »గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తులు గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal