ఏపీ వాహనమిత్ర స్కీమ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా సీఎం చంద్రబాబు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వీటిని అందించనున్నారు. అయితే ఈ పథకం రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఎవరు అర్హులు అంటే..? ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇటీవలే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. దసరా కానుకగా రూ.15వేలు అందజేస్తామన్నారు. వాహనమిత్ర పథకం కింద …
Read More »భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై గన్నవరం ఎయిర్‌పోర్టులోనూ దుర్గమ్మ దర్శనం భాగ్యం!
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈఓ శీనా నాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా, బెజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాకపోకలు సాగించే ప్రయాణికులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అమ్మవారి రెండు భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈఓ శీనా నాయక్ గారు …
Read More »తిరుపతిలో మిస్టరీ మరణాలు.. అటవీ ప్రాంతంతో లభ్యమైన నాలుగు మృతదేహాలు!
తిరుపతి జిల్లా పాకాల మండలంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాకాల వారి పల్లి అటవీ ప్రాంతంలో నాలుగు డెడ్ బాడీలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోకి పశువులను మేపేందుకు వెళ్లిన స్థానికులకు ఈ మృతదేహాలు కనిపించడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చెట్టుకు ఉరి వేసుకున్న రెండు మృతదేహాలను గుర్తించగా పక్కనే మరో రెండు డెడ్ బాడీలను పూడ్చి పెట్టినట్లు కనుగొన్నారు. చెట్టుకు వేలాడిన రెండు డెడ్ బాడీ …
Read More »నిరుద్యోగులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ CRDAలో ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని సీఆర్‌డీఏలో.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు ఏపీ సీఆర్‌డీఏలో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షణకు పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో చీఫ్ ఇంజినీర్ పోస్టులు 4, సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు 8, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పోస్టులు 15. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు 25, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు/అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 50, సీనియర్ ఫైర్ సేఫ్టీ …
Read More »కారు బ్రేక్ డౌన్.. ఈ లోపే పోలీసుల ఎంట్రీ.. స్మగ్లర్స్ ఏం చేశారంటే?
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. 20 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పుంగనూరు పోలీసులకు దొరికిపోయారు. నిందితుల నుంచి రూ.33లక్షల విలువైన ఎర్రచందనం సహా ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఒకరు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట నుంచి పుంగనూరు మీదుగా కర్ణాటకకు అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్ల కారు అర్ధరాత్రి సమయంలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద వారి వాహనం బ్రేక్‌డౌన్ అయింది. ఇక రాత్రి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని …
Read More »తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం.. వచ్చే 2 రోజులు రెయిన్ అలెర్ట్.. బీ అలెర్ట్.!
ఉత్తర తెలంగాణ దాని సమీపంలోని విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర తెలంగాణ, మధ్య విదర్భ దాని పరిసరాలలో ఉత్తర దిశలో బలహీనపడే అవకాశం ఉంది. ఈ రోజు అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు …
Read More »అయ్యో అన్నదాత.. కిలో ఉల్లి 30 పైసల్.. మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి..
నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని.. కిలో 30 పైసలు మాత్రమే ఉందని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం మార్కెట్ కు భారీగా ఉల్లి వస్తోంది.. క్వింటాల్ ఉల్లి 1200లకు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్.. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం …
Read More »అలర్ట్.. మెగా డీఎస్సీ -2025 తుది జాబితా విడుదల.. డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి
మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్ట్‌లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను (సెప్టెంబర్ 15) ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్పీ అధికారిక వెబ్‌సైట్‌లో https://apdsc.apcfss.in/ తుది ఎంపిక జాబితాను విడుదల …
Read More »మణిపూర్ ప్రజలకు అండగా ఉంటా.. శాంతితోనే అభివృద్ధి సాధ్యంః ప్రధాని మోదీ
మణిపూర్‌ను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు. చురాచంద్‌పూర్‌లో, హింస తర్వాత నిరాశ్రయులైన ప్రజల కుటుంబాలను ప్రధాని మోదీ కలిశారు. దీనితో పాటు, ప్రధాని మణిపూర్‌కు రూ.8500 కోట్ల …
Read More »ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి.. ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య & దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం శనివారం 13 సెప్టెంబర్ 2025 IST 0830 గంటలకు విస్తరించి కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మట్టం ఎత్తుతో నైరుతి దిశగా …
Read More »లక్కీ భాస్కర్‌ను మించిపోయావ్ కదా మావ.! కిలోల బంగారం హుష్ కాకి..!
ప్రజల్లో ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకాన్ని వమ్ము చేసే ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్ గోల్‌మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలోని ఎస్‌బీఐలో మరో గోల్డ్ లోన్ గోల్ మాల్ వ్యవహారం బట్టబయలైంది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా ఆడిట్‌లోనే అక్రమాల భాగోతం బయటపడింది. నిర్మల్ లోనూ ఇంటి దొంగే బ్యాంకుకు కన్నం వేసి 20 లక్షల రూపాయలకు పైగా స్కామ్‌కు పాల్పడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో బ్యాంకు మోసం బట్టబయలైంది. మంచిర్యాల …
Read More »చైనా, భారత్‌పై సుంకాలు విధించండి! జీ7 దేశాలకు అమెరికా పిలుపు..
జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ జరిగింది. అమెరికా తన మిత్రదేశాలకు రష్యన్ చమురు దిగుమతిని నిరోధించడానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం అందించడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అంశం కూడా చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు అమెరికా ఒక కీలక పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏడు దేశాల …
Read More »గిరిజన భాషల పరిరక్షణకు కీలక ముందడుగు..! ఆదివాణి పేరుతో AI ట్రాన్స్‌లేటింగ్ యాప్
భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడేందుకు ‘ఆదివాణి’ అనే AI ఆధారిత అనువాద యాప్‌ను ప్రారంభించింది. ఇది గిరిజన భాషలను ఇతర భాషలకు అనువదించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ లోని అంతరాలను తగ్గించడం, గిరిజన సంస్కృతి ని సంరక్షించడం ఈ యాప్ లక్ష్యం. మన దేశంలో ఎన్నో భాషల ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన చాలా భాషలకు లిపి కూడా లేదు. అంత మాత్రానా అవి తక్కువని కాదు. కానీ, తక్కువ మంది మాట్లాడే భాషలుగా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సమాజం …
Read More »ఫ్యాన్సీ నంబర్ క్రేజే వేరప్ప.. ఒక్క రోజులో రూ.64 లక్షల ఆదాయం! ఒక్క నంబర్ రూ.25 లక్షలు
తెలంగాణలో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను చూపిస్తూ, ఖైరతాబాద్ RTO వేలంలో రూ.63,77,361 ఆదాయం సమకూరింది. హెటెరో డ్రగ్స్ రూ.25,50,200 చెల్లించి TG09J 9999 నంబర్‌ను దక్కించుకుంది. ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా లక్షల్లో ఖర్చు చేసి ప్రత్యేక నంబర్లను కొనుగోలు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. కొంతమంది లక్కీ నంబర్ల కోసం, మరి కొంతమంది సీరియల్ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. లక్షలు పెట్టి కొన్న తమ వాహనానికి …
Read More »క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal