రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయి.. ఇక తెలంగాణపై దృష్టిపెడతాం.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

పార్టీ ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్‌ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు లోకేష్‌. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్‌ జగన్‌నే అడగాలన్నారు లోకేష్‌. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్‌ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్‌. పక్క రాష్ట్ర …

Read More »

సూపర్ సిక్స్- సూపర్ హిట్ బహిరంగ సభకు సిద్ధం.. నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవ్‌!

ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే కార్యకర్తలు.. అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి …

Read More »

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ప్రమాదమేనన్న విషయం వైద్యులు పదేపదే చెబుతుంటారు. కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలంటే లిపిడ్ పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. మీరు ముఖంపై అలాంటి గుర్తులు కనిపిస్తే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి. చర్మం పసుపు: ముఖంపై పసుపు రంగు కనిపిస్తే అది …

Read More »

పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీకి చిక్కిన మరో లేడీ ఆఫీసర్!

రాష్ట్రంలో అవినీతి పరులను ఏరిపారేడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుపడింది. హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుపడ్డారు. అమె నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న కొందరిలో మాత్రం అస్సలూ మార్పు రావడం లేదు. మనల్ని ఎవరులే పట్టుకునేది అనేలా జనాల నుంచి లంచాలు …

Read More »

అక్క స్కూల్‌కు వెళ్తుండగా వెంట వచ్చిన బాలుడు.. కాసేపటికే వెలుగు చూసిన దారుణం!

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్క బస్సు ఎక్కేందుకు వెళుతుండగా ఆమె వెంటనే చూసేందుకు వచ్చిన బాలుడిని బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముక్కుపచ్చలారని చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అక్క స్కూల్‌కు వెళ్తుండగా చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురై తమ్ముడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలోని అవుకు మండలం సుంకేసుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన …

Read More »

హిమాచల్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే.. రూ.1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన!

హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు, వర్షాల ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. కాంగ్రాలో సమావేశం ద్వారా ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించి ప్రమాద నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల …

Read More »

అటెండెన్స్ సరిగ్గా లేదన్న ప్రొఫెసర్.. కట్ చేస్తే.. స్టూడెంట్ చేసిన పనికి దెబ్బకు మైండ్ బ్లాంక్

ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్‌ఐటీలో ప్రొఫెసర్‌పై స్టూడెంట్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఏకంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రం సంచలనం రేపుతోంది. ఘటనకు పాల్పడ్డ ఏం టెక్ (ట్రాన్స్‌పోర్ట్) స్టూడెంట్ మజ్జి వినాయక పురుషోత్తంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఐఐఐటీలో విద్యార్థులకు సెకండ్ సెమ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికోసం విజయనగరానికి చెందిన పురుషోత్తం రావటంతో అక్కడ డ్యూటీలో ఉన్న సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు అతడిని లోపలకి అనుమతించలేదు. సరియైన హాజరు లేదని, హెచ్‌ఓడి అనుమతి …

Read More »

సీక్రెట్ బ్యాలెట్ పోలింగ్‌ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఆ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినవారే విజేత!

ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2025 ఓటింగ్ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్.. ఫలితాలు.. రెండూ ఒకే రోజు వెలువడనున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సి. పి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వీరే.. ఇక ఉపరాష్ట్రపతి …

Read More »

అవిభక్త కవలలు వీణా-వాణీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు..? వారి పరిస్థితేంటీ..?

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ స్టేట్ హోమ్‌‌లో నివసిస్తున్న అవిభక్త కవలలు వీణా, వాణి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కలిసే ఉన్న ఈ ఇద్దరూ చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇటీవల డిగ్రీలో డిస్టింక్షన్‌ సాధించి ఇప్పుడు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) కోర్సు కంప్లీట్ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేయడం తాము ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవడంతో.. సీఏ చేయాలని నిర్ణయించుకున్నట్లు వీణా-వాణిలు చెబుతున్నారు. ఈ అభివక్త కవలల రోజు ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. తొలుత తెలుగు, ఇంగ్లీషు పేపర్స్ …

Read More »

తిరిగి పార్టీలోకి వచ్చేయండి.. తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ నేతలే టార్గెట్‌గా..

తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టిందా.. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి వెల్‌కమ్‌ పలుకుతారా?.. పార్టీ వీడిన వారిలో సీనియర్లు ఎవరున్నారు. పాత వాళ్లని మళ్లీ వెనక్కి పిలవడం వల్ల కాంగ్రెస్‌కు ఏం లాభం.. అసలు సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది ఈ కథనంలో తెలుసుకోండి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం, ఇతర నేతలతో విభేదాల కారణంగా …

Read More »

గ్రూప్‌ 1పై హైకోర్టు సంచలన తీర్పు.. మెయిన్స్‌ ఫలితాలు రద్దు!

ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని 20 మంది అభ్యర్థులు ఈ పిటీషన్లలో కోరారు.  తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీ గ్రూప్ 1పై బుధవారం (సెప్టెంబర్‌ 9) సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్‌ …

Read More »

సినీ ప్రముఖుల ఇళ్లకు అదే పనిగా వెళ్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఏంటా అని ఆరా తీయగా

హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులను వేధించిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరరావు చివరికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానంటూ సినీ సెలబ్రిటీలను భయపెట్టడం, వారి ఇళ్లకు వెళ్లి వేధించడం, పెద్ద ఎత్తున బెదిరింపులు గురిచేయడం వంటి పనులతో.. కలకలం రేపిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడి వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు, తన హోదాను మించిపోయి ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకుంటూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన వాట్సాప్‌ డీపీ, స్టేటస్‌లలో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ …

Read More »

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఈ రోజు విజయవాడ జిల్లా జైలు, గుంటూరు జిల్లా జైలులో ఉన్న నిందితులను కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కాం కేసులో 12 …

Read More »

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల కారణంగా లంక గ్రామాల ప్రజలు వరద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. …

Read More »

సీఎం ఇల్లు అయితేనేం.. కూల్చేయాల్సిందే..! అందరికీ ఆదర్శంగా రేవంత్ రెడ్డి..

అభివృద్ధి విషయంలో తరతమ భేదాలు చూడకూడదని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ మాటను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టిన 4 లేన్ల రోడ్డు నిర్మాణ పనుల వేళ.. తన ఇంటి ఇంటి ప్రహరీ అడ్డు రావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే కూల్చేయాలని ఆదేశాలిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని మొత్తం 43 ఇళ్లను పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలతో.. కొండారెడ్డిపల్లిలో …

Read More »