Blog Layout

ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. …

Read More »

కృష్ణమ్మ ఒడ్డున జల యోగాసనాలు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు!

యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ …

Read More »

కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్‌, జగన్‌ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …

Read More »

ఆ దేశ ప్రధానికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ..! ఎందుకంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో ఉన్నారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు, ప్రధానమంత్రికి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విలువైన హస్తకళలను బహుమతిగా ఇచ్చారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిశా నుండి పట్టచిత్ర పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతికి ‘పట్టచిత్ర పెయింటింగ్’ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్ కు ఒడిశా నుంచి వచ్చిన సాంప్రదాయ పట్టచిత్ర పెయింటింగ్ ను ప్రధాని మోదీ …

Read More »

అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..

భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు …

Read More »

కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్‌

కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) తాజా నివేదికలో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలు, నిధుల సేకరణ, ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించింది. ఇది భారతదేశం ఎప్పటినుంచో లేవనెత్తుతున్న ఆందోళనలను ధృవీకరిస్తుంది. కెనడా ప్రభుత్వం “ఉగ్రవాదం” అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను …

Read More »

శ్రీవారికి భక్తులు సమర్పించిన మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ లో వేలం.. ఎప్పుడంటే..

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుమల తిరుపతిలో ఉన్న ఇతర అనుబంధ …

Read More »

టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …

Read More »

థాంక్ గాడ్ రక్షించినందుకు.. సోనమ్ చేతిలో రాజాకి బదులుగా నేను మరణించే వాడిని అంటున్న యువకుడు.. ఎందుకంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలిసిందే. హనీమూన్ కి వెళ్ళిన రఘు వంశీ, సోనమ్ ల కథ ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న రియల్ స్టోరీ. అయితే ఇప్పుడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తోంది. సోనమ్ చేతిలో మరణించాల్సి వ్యక్తిని నేనే.. దేవుడి దయవలన అదృష్టవశాత్తు నేను రక్షించబడ్డాను.. రఘువంశీకి మరణించాడు అని ధార్ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సోనమ్ జీవితంలో ఉన్న మరో రహస్యాన్ని వెల్లడించాడు. తనకు సోనమ్ పెళ్లి …

Read More »

సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …

Read More »