క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం …
Read More »Blog Layout
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సొమవారం ఉదయం వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరొకరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి …
Read More »నైరుతి రుతుపవనాల రాక.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా …
Read More »దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్ చేసిన టార్గెట్‌లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో …
Read More »నేడు కాకతీయ వాసరత్వ సంపద, శిల్పాకళ సందర్శనకు అందగత్తెలు.. వాహ్ వరంగల్ అనేలా ఏర్పాట్లు.
కాకతీయుల వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.. ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం కాకతీయ శిల్ప సంపదకు నిలయమైన రామప్ప ఆలయం, వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అందగత్తెలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఇప్పుడు నయా లుక్ తో వెలిగి పోతున్నాయి..వరంగల్ జిల్లాలో ఈ రోజు ప్రపంచ అందాల సుందరిమణులు రెండు టీములుగా పర్యటించనున్నారు.. గ్రూపు- 1 టీమ్ లో22 మంది, గ్రూప్-2లో 35 మంది …
Read More »ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి 50 కి.మీ. దూరంలో ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పని చేస్తోంది.సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉన్న 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పూర్తి …
Read More »కోర్టులో ఉద్యోగాలు లైఫ్ సెటిల్ అనుకుని డబ్బులిచ్చారు.. కట్ చేస్తే..
నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ, అమాయక నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ మహిళలకు జాదూగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు గుమస్తాగా పని చేస్తున్నారు. మరోవైపు పలు కేసులపై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసేవాడు. నల్లగొండకు చెందిన జ్యోతి రాణి జూనియర్ అడ్వకేట్‌గా పని …
Read More »వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో …
Read More »తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13న పాలిసెట్ 2025 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలిసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక పాలీసెట్ ఫలితాలు ఈ …
Read More »ఏపీ ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ అర్హతతో బీటెక్‌లో అడ్మిషన్
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal