Blog Layout

సంస్కారంతో నమస్కారం పెట్టినా పెద్ద దుమారం.. ఆలింగనం చేసుకుంటే అంతే సంగతులు!

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌… వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారంటూ గత రెండ్రోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ట్రోలర్స్‌ పేట్రేగిపోతున్నారు. దీంతో ఇష్యూపై ఇటు కొండపల్లి శ్రీనివాస్‌ అటు బొత్స సత్యనారాయణ ఇద్దరూ స్పందించారు. ఇక ఆ మధ్య మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జోగి రమేష్‌ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఏపీలో రచ్చ లేపింది..ఒకరికొకరు కంటపడ్డారా కనికరిస్తామేమో..! చెయ్యి కలిపారో చెడుగుడేనప్పా. కాదు కూడదు.. సరదాగా మాట్లాడుకుంటాం, ఆలింగనాల వరకూ వెళ్తామంటే.. నా సామిరంగ అస్సల్‌ కథ …

Read More »

 ‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో సూచించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని, ఇకపై అలా జరగడానికి వీలులేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం 272 రకాల పోస్టులను నాన్‌ టెక్నికల్, టెక్నికల్‌ సర్వీసెస్‌ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నాన్‌-టెక్నికల్‌ విభాగంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, …

Read More »

యూజీసీ- నెట్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ

యూజీసీ- నెట్‌ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు యూజీసీ వీటిని విడుదల చేసింది. అభ్యర్ధులు తమ వివరాలు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష మరో 3 రోజుల్లో …

Read More »

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్ (AP Govt New Chief Secretary K Vijayanand) పేరు అధికారికంగా ఖరారయ్యింది. ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన. విజయానంద్, సాయి ప్రసాద్‌ల మధ్య సీఎస్ పదవికి కోసం గట్టి పోటీ నెలకొంది. అయితే చివరకు ప్రభుత్వం విజయానంద్ వైపే మొగ్గుచూపింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం …

Read More »

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా కొత్త మధుమూర్తి బాధ్యతలు స్వీకరించారు. నిట్‌ వరంగల్‌లో మెకానికల్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన కీలక సమావేశం నిర్వహించారు..ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని మండలి కార్యాలయంలో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, ఉద్యోగులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిట్‌ వరంగల్‌లో మెకానికల్‌ …

Read More »

దేశ, విదేశాల కరెన్సీ.. 33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..

నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగి పేరుగాంచిన బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు సేకరించినట్లు తెలిపారు..కరెన్సీ సేకరణ ఆయన హాబి. అందుకే ఆయన అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.. కర్నూలు ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవరశెట్టి వినోద్ కుమార్ అనే వ్యక్తి విభిన్నంగా ఆలోచించి కరెన్సీని 33 సంవత్సరాలుగా …

Read More »

అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిపారు. నిగంబోధ్‌ ఘాట్‌లో మన్మోహన్ భౌతికకాయానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య సంస్కరణల యోధుడికి తుది వీడ్కోలు పలికారు అభిమానులు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. అంతకుముందు ఏఐసీసీ ఆఫీస్‌లో …

Read More »

అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..

ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. పోలీసులు అంతా ఆ కారును చుట్టుముట్టి ఆపారు.. ఆ తర్వాత వివరాలు అడిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. మొదట ఏం కనిపించలేదు.. కానీ.. అప్పుడే.. కొంత మందిని రంగంలోకి దింపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో దిమ్మతిరిగే ట్విస్ట్ తెరపైకి వచ్చింది..ఓ కారు.. అందులో ఓ వ్యక్తి దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే దిమ్మతిరిగే ట్విస్ట్ …

Read More »

వాట్సాప్‌లో వచ్చిన లింక్.. ఒక్క సెకనులో రూ.6 లక్షలు పోగోట్టుకున్న యువకుడు.. బీ కేర్ ఫుల్!

Digital Scam: ఈ రోజుల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌లకు లింక్‌లను పంపిస్తూ వాటిని క్లిక్‌ చేయగానే వివరాలన్ని సైబర్‌ నేరగాళ్లకు వెళ్లిపోతున్నాయి. ఇంకే ముందు క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంటుంది. ఇలాంటి మోసాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయగానే సెకనులోనే రూ.6 లక్షలు మాయం అయ్యాయి..కర్ణాటకలో డిజిటల్ మోసానికి ఓ యువకుడు రూ.6.6 లక్షలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది. యువకుడు వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయగా, అతని …

Read More »

పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే!

ప్రతి ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తప్పనిసరిగా ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం.. ఇలా సర్వరోగ నివారిణిగా వీటిని ఎడాపెడా వాడేస్తుంటాం. ఇలా డాక్టర్ల సలహా తీసుకోకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ప్రాణాలకు ముప్పు తలపెడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్ని పారాసిటమాల్ మాత్ర వేసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ పిల్ అన్ని వయసుల వారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ మాత్రలు సాధారణంగా …

Read More »