Blog Layout

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. హెల్మెట్లు ఎందుకు పెట్టుకోవట్లేదు.? కఠినమైన ఆంక్షలు ఎందుకని పోలీసులు అమలు చేయటం లేదని.? ప్రశ్నించడంతో రంగంలోకి దిగిన..సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై వాహనాదారులలో హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాలతో ట్రాఫిక్ అండ్ లా & ఆర్డర్ పోలీస్ …

Read More »

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌.. ఆంటోనితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్‌ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్‌ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనిని …

Read More »

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు చేసి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి సంవత్సర యానివర్సరీ అంటూ కేక్ తయారు చేసి కలెక్టరు కార్యాలయంలోనే కేక్ కట్ చేసేందుకు వచ్చిన బాధితుడిని చూసి అధికారులు షాక్ అయ్యారు.ఆక్రమణలు తొలగించి ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏడాది క్రితం అర్జీ అందించారు. మళ్లీ పలుసార్లు అర్జీలు ఇచ్చినా పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు ఆ అర్జీలను పరిష్కరించినట్టు చూపుతూ క్లోజ్ చేస్తున్నారు. ఇటీవల …

Read More »

గురునానక్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్.. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు

గురునానక్‌ కాలేజీలో విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అసలు వీళ్లు ఎక్కడికి వెళ్లారు…? ఎవరి చెప్పకుండా పారిపోయారా..? లేదంటే కిడ్నాప్‌కు గురయ్యారా..? కాలేజ్ యాజమాన్య ఏమంటుంది… పోలీసుల గాలింపు ఎలా సాగుతుంది..? డీటేల్స్ తెలుసుకుందాం పదండి…రంగారెడ్డి జల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లిదండ్రులలో, ఇటు కాలేజీ యాజమాన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు అదృశ్యమైనట్లు కళాశాల …

Read More »

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. మరి ఆయన ఈ నోటీసులపై పై కోర్టుకు వెళ్తారా..? విచారణకు హాజరవుతారా..? డీటేల్స్ తెలుసుకుందాం…మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి కోర్టు …

Read More »

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?

ప్రియుడితో భార్య యవ్వారం నడుపుతుందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించిన భార్య బుద్ధి మారకపోవడంతో నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనుమూరు మండలంలో భార్య మరో వ్యక్తిపై మనసు పారేసుకోవడం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మరో వ్యక్తితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోవడంతో ఇద్దరి మధ్య గత కొన్ని …

Read More »

మీ పాదాలు, చేతులు మాటి మాటికీ చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా

సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొందరికీ ఎల్లవేళలా ఇలా పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇది అనారోగ్యానికి సంకేతం. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు..చల్లని గాలి ఒంటికి తాకితే ఒక్కసారిగా చేతులు, కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్లు మళ్లీ వేడెక్కుతుంది. ఇలా చల్లని వాతావరణంలో శరీర భాగాలు వేడెక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యం అని అర్ధం. …

Read More »

తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?

అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్‌.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్‌ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం …

Read More »

సంధ్య థియేటర్ కేసులో మరో కీలక పరిణామం.. దానిపైనే పోలీసుల ఫోకస్..!

సినీ నటులు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్య ధియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్‌ విచారణ కొనసాగుతోంది. థియేటర్‌లో తొక్కిసలాట ఘటనతోపాటు అతర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టారు. అల్లు …

Read More »

ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై వ్యక్తి పేరుతో పాటు తల్లి పేరు తప్పనిసరి..!

జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మే 1 నుండి అమలు కానుంది. అయితే, అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేర్లను గమనిస్తే.. ముందు ఆ వ్యక్తి పేరు (First Name), తర్వాత ఇంటి పేరు (Surname) లేదా తండ్రి పేరు కనిపిస్తుంది. అంతర్జాతీయ ట్రావెల్ డాక్యుమెంట్ …

Read More »