Blog Layout

పాపం చిట్టితల్లి.! ఉదయాన్నే ఆనందంగా స్కూల్‌కు వెళ్లింది.. ఇంతలోనే..

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుంది. స్కూల్ బస్సు దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. దీంతో నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. నల్గొండ పట్టణానికి చెందిన రాధిక అనే మహిళకు జశ్విత అనే ఐదేళ్ల కూతురు ఉంది. స్థానిక దేవరకొండ రోడ్డులోని మాస్టర్ మైండ్ స్కూల్‌లో జశ్విత ఎల్‌కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే తన కూతురిని పాఠశాలకు రెడీ చేసి పంపించింది రాధిక. బస్సు …

Read More »

ఇది కదా పండగంటే.. సామాన్యులకు బంపర్ బొనాంజా.. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ ఎంత తగ్గిందంటే..

దసరా, దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్‌ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నిజం చేస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఐదు శాతం, రెండోది 18శాతం. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. సగటున ఓ కుటుంబానికి చూస్తే.. కనీసం 1500 నుంచి 2000 వరకూ ఆదా అవుతుందనే అంచనాలున్నాయ్‌.. ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల విషయంలో మనకు …

Read More »

లక్షలు డ్రా చేయాలంటూ బ్యాంక్‌కు వచ్చిన వృద్దుడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం,అలాగే సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకు నిదర్శనమే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన. కె.డి.సి.సి. బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి చలసాని పూర్ణ చంద్రరావు అనే 74 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటలు పాటు వేధించారు. వారి ఒత్తిడికి భయపడి సదరు …

Read More »

ఇకపై చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. ఈ కామర్స్‌కు 40 ఆప్కోషో రూమ్‌లు అనుసంధానం

నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు.. ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచింది.  వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం ఇకపై అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ …

Read More »

ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం.. సీన్‌లోకి కూతురి ఎంట్రీతో

యూట్యూబ్‌లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు. ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరిని నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు. యువతిని చంపి ఆ డెడ్‌బాడీ వద్ద క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్ళతో హైడ్రామా క్రియేట్ చేసిన ఆ మర్డర్ మిస్టరీ వీడింది.  డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు.  తీగలాగితే దొంగ కదిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. అచ్చం దృశ్యం కథను మరిపించేలా కన్నతల్లి మర్డర్ స్కెచ్ వేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కసాయి తల్లితో …

Read More »

బీఆర్ఎస్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టిన కవిత ఇష్యూ!

మంత్రి పదవి ఇవ్వనందుకే కొత్త పార్టీ… ఇదెన్నాళ్లుంటుందిలే అన్నారు టీఆర్ఎస్‌ పెట్టినప్పుడు. ఆ మాటలన్న కొన్నాళ్లకే స్థానిక సంస్థల్లో సత్తా చాటింది కారు గుర్తు. కాంగ్రెస్‌ ఇచ్చిన మంత్రి పదవేగా.. దమ్ముంటే రాజీనామా చేయ్, గెలిస్తే తెలంగాణకు రెఫరెండమే అన్నారు సాక్షాత్తు ఆనాటి సీఎం వైఎస్. బ్రహ్మాండమైన మెజారిటీ ఆనాడు. ఉద్యమం తారస్థాయికి చేరిన వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కారు ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. పార్టీలో చీలికలు. ఒకసారి కాదు.. రెండు సార్లు. గులాబీ పార్టీని వీడింది ఒకరిద్దరు కాదు.. పది మంది. నాడు …

Read More »

విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో వరుసగా 3 రోజులు పాఠశాలలకు సెలవులు!

గతనెల ఆగస్ట్‌లో కూడా విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్‌ నెల. ఇప్పుడు కూడా విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజులు. ఆ తర్వాత దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఇప్పుడు వరుసగా.. విద్యార్థులకు భారీ శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో వరుసగా సెలవులు ఉండనున్నాయి. 6వ తేదీ (శనివారం) గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, …

Read More »

కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. జమ్మికుంటలో ఆగనున్న ఆ మూడు రైళ్లు..

ఎట్టకేలకు జమ్మికుంట వాసుల కోరిక నెరవేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జమ్మికుంట ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంత …

Read More »

భాగ్యనగరానికి అమిత్ షా.. తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరం గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అమిత్ షా స్వామి కార్యంతో పాటు పార్టీ కార్యం కూడా పూర్తి చేసే ప్లాన్ తో వస్తున్నట్ల తెలుస్తోంది. ఇంతకీ షా సడెన్ సౌత్ ట్రిప్ కు కారణమేంటి..? తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా? సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాబోతున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి …

Read More »

‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు …

Read More »