భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. దశాబ్దం క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నినాదంగా మారి ఎంతో మార్పును తీసుకువచ్చింది.. ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత దశాబ్దం క్రితం ఐదో వంతుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పైగా భారతీయ కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇతర లక్ష్యాలతో పాటు, మరిన్ని మరుగుదొడ్లు నిర్మించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా బహిరంగ మలవిసర్జన ముగింపు పలికేందుకు మోదీ …
Read More »Blog Layout
రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..
అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది. ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా …
Read More »మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు.
ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది. లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.. ఈ స్టోర్ల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయిల కాగా.. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయిలుగా నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్సు రుసుము 10శాతం చొప్పున పెరుగుతుంది. ప్రీమియం షాపుల లైసెన్సుదారులకు ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్ చెల్లిస్తారు. ఈ ప్రీమియం …
Read More »సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసుల సీరియస్.. అడ్డగోలు పోస్టులకు కేసులు తప్పవని వార్నింగ్..!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే.. తాట తీస్తోంది తెలంగాణ పోలీస్. ఇదే క్రమంలో లేటెస్టుగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై యాక్షన్ మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి చిన్న విషయం దగ్గరి నుంచి వార్తల వరకు సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారం రీల్స్ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లపై పిచ్చిగా వ్యవహరించడం. డబ్బులు వెదజల్లడం, వెకిలి చేష్టలతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. అయితే …
Read More »తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు.. వైద్యుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా..అల్లూరి జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ …
Read More »పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని …
Read More »ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి
ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను …
Read More »విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని …
Read More »రెచ్చిపోతున్న ర్యాప్ ముఠాలు.. లక్షల రూపాయల కొల్లగొడుతున్న మాయగాళ్లు..!
బాపట్ల పరిసర ప్రాంతాల్లో ర్యాప్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న అడపా దడపా ర్యాప్ గ్యాంగ్‌ల ఆగడాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ముప్పై మూడు లక్షల రూపాయలను అత్యంత్య తెలివిగా ర్యాప్ గ్యాంగ్ కొట్టేసింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాప్ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కల్యాణ్ చక్రవర్తి హోల్ సేల్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతనికి నర్సరావుపేటకు …
Read More »నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులు! మొత్తం ఎన్నంటే
ఇంటర్మీడియట్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్ల తదితర సంస్థల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం 3,712 వరకు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులను పెంచుతూ తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal