Blog Layout

ప్రతి రైలు టికెట్‌పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి కీలక విషయాలు!

 దేశంలోనే రైల్వే స్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం.. భారత రైల్వే ద్వారా ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అన్ని రకాల రైలు టికెట్లపై రాయితీలు కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి లోక్‌ సభలో పలు కీలక విషయాలను వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి …

Read More »

ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన

అర్హులైన ప్ర‌తి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధ‌వారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల‌క్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ల‌బ్ధి పొందుతున్నార‌ని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో ల‌బ్ధిదారులుగా ఉన్నార‌ని మంత్రి …

Read More »

కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు …

Read More »

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దేశంలోనే తొలి సెంటర్‌గా..

తెలంగాణ ప్రభుత్వం మరో విజయం సాధించింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) స్థాపనకు అంగీకరించింది. ఇది భారత్‌లో తొలి సెంటర్‌గా, ఏషియా పసిఫిక్‌లో రెండవదిగా, ప్రపంచవ్యాప్తంగా ఐదవదిగా గుర్తింపు పొందనుంది. గూగుల్ LLC, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం ఈ కీలక ఒప్పందం కుదిరింది. GSEC సెంటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దనుంది. గూగుల్ సెంటర్ సైబర్ భద్రత, ఆన్‌లైన్ సేఫ్టీ ఉత్పత్తుల రూపకల్పనపై ఫోకస్ చేయనుంది . అధునాతన పరిశోధనలతో పాటు …

Read More »

 చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది.. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ …

Read More »

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయిన డ్రైవర్.. కాలవలో పడిన కారు.. తప్పిన ప్రాణాపాయం

కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లి ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై గూగుల్ మ్యాప్స్‌తో చూపించిన విధంగా వెళ్ళిన వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.దారి తెలియకపోతే ఏమిటి.. గూగుల్ మ్యాప్ ఉండగా చింత ఎందుకు దండగ అని అనుకుంటున్నారా.. గూగుల్ మ్యాప్ పై భరోసాతో వాహనంలో ప్రయనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. గుడ్డిగా గూగుల్ ని నమ్మి గూగుల్ మ్యాప్స్‌ మార్గనిర్దేశం చేసిన …

Read More »

భారతదేశంలోనే అతిపెద్ద నోటు.. 32 ఏళ్లుగా చెలామణిలో..

Indian Currency Notes: ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అతిపెద్ద నోటు. అయితే దేశంలో రూ.10,000 నోటు చెలామణిలో ఉన్న సమయం ఉంది. అది కూడా స్వాతంత్య్రానికి ముందు. 1938 సంవత్సరంలో రూ.10,000 నోటును విడుదల చేశారు. ఈ నోటు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నోటు. అందుకే ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుండి మూసివేసే వరకు దాని ప్రయాణం గురించి తెలుసుకుందాం. నోటు ఎందుకు తెచ్చారు? స్వాతంత్య్రానికి ముందే ఇంత పెద్ద నోటును చలామణిలోకి తీసుకురావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇంత పెద్ద …

Read More »

ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్టపై దురద ఇబ్బంది పెడుతుందా? ఇలా చేస్తే చిటికెలో మాయం

తల్లి అవడం ప్రతి అమ్మాయికి ఓ అద్భుతమైన అనుభవం. ఆ సమయంలో పుట్టబోయే తన బిడ్డను తల్చుకుంటూ ఎంతో మురిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో కంగారుపడిపోతుంటారు కాబోయే అమ్మలు. ముఖ్యంగా రోజులు గడిచేకొద్దీ పెరుగుతున్న పొట్టచుట్టూ విపరీతమైన దురద వేధిస్తుంది.. దీని నుంచి ఉపశమనం పొందాలంటే.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి …

Read More »

జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!

మీరు స్మోకరా.. టొబాకో ఉత్పత్తులేమైనా వాడతారా? పోనీ.. కార్లు, కాస్ట్‌లీ డ్రస్‌లు, కాస్మొటిక్స్‌ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ విషయంలో మరో ముందుడుగు వేసింది. కొత్తగా మరో శ్లాబ్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.. జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌ను తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. సిన్‌ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారుచేస్తుంది. ఈ  ప్రొడక్ట్స్‌పై కొత్తగా 35% జీఎస్టీ విధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన జీఎస్టీ- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ …

Read More »

భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …

Read More »