భారతదేశానికి సంబంధించినంతవరకు అది కారు రుణం అయినా, వ్యక్తిగత రుణం అయినా, లేదా గృహ రుణం అయినా, దానికి CIBIL స్కోరు తప్పనిసరి. మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకోవాలనుకుంటే మీకు ఒక నిర్దిష్ట CIBIL స్కోరు ఉండాలి. భారతీయ బ్యాంకుల్లో తొలిసారి రుణం తీసుకునేవారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చాలాసార్లు సిబిల్ స్కోరు కారణంగా మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులు తిరస్కరిస్తుంటారు. ఈ పరిస్థితిలో సిబిల్ స్కోరు గురించి వివరణ ఇచ్చిన ఆర్థిక శాఖ సహాయ …
Read More »Blog Layout
ఏపీలో వినాయక మండపాలు పెట్టేవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మంచిగా మండపం ఏర్పాటు చేసి.. వినాయకుడి విశేష పూజలు చేయాలనుకుంటున్నారా..? భక్తిశ్రద్దలతో, నోరూరించే నైవేద్యాలతో అందరూ కలిసి ఆ ఆది దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. ఏపీ వ్యాప్తంగా గణేశ్ మండపాలకు.. ఉచితంగా కరెంట్ అందజేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న వేళ.. గణేశ్ మండపాల నిర్వాహకులకు శుభవార్త అందింది. ఉత్సవ మండపాల్లో ఏర్పాటు చేసే పందిళ్లకు ఇకపై ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనుంది. వినాయక మండపాల నిర్వాహకులు ఇటీవల మంత్రి …
Read More »విద్యార్థులకు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం పాఠశాలలు బంద్!
అనేక రాష్ట్రాల్లో కూడా పాఠశాల సెలవు విధానాలు మారవచ్చు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు లేదా వివిధ విద్యా బోర్డులతో అనుబంధంగా ఉన్న సంస్థలు సెలవును పాటించకపోవచ్చు లేదా ప్రత్యామ్నాయ సమయాల్లో తరగతులను షెడ్యూల్ చేయవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గణేష్ చవితి అనేది హిందూ పండుగల్లో ముఖ్యమైనది. గణేష్ చతుర్థి బుధవారం ఆగస్టు 27, 2025న వస్తుంది. ఈ పండుగను భారతదేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా పూజలు, సాంస్కృతిక ఉత్సవాలతో విస్తృతంగా జరుపుకుంటారు. సహజంగానే కుటుంబాలు, విద్యార్థులు వేడుకల్లో పూర్తిగా పాల్గొనడానికి ఈ …
Read More »యవ్వనానికి నెయ్యి.. 10 ఏళ్లు చిన్నవారిలా కనిపించడానికి ఈ ఒక్కటి చాలు..! రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోతారు..!
నెయ్యి మన వంటింట్లో ఎప్పుడూ ఉండేదే. కానీ దాని గొప్పతనం చాలా మందికి తెలియదు. కేవలం ఒక స్పూన్ నెయ్యి రోజూ తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పోగొట్టడానికి, చర్మాన్ని మెరిపించడానికి నెయ్యిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే అది మన ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెయ్యి ఎలా వాడితే మనం యవ్వనంగా, అందంగా కనిపిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిని మన …
Read More »ప్రారంభమైన రబీ ఉల్ అవ్వల్ నెల..! మిలాద్ ఉన్ నబీ ఎప్పుడు జరుపుకోవాలంటే?
మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ రబీ ఉల్ అవ్వల్ 1447 AH (2025) నెలవంక కనిపించినట్లు ప్రకటించింది. ఆగస్టు 25, సోమవారం నుండి రబీ ఉల్ అవ్వల్ ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం అయిన ఈద్ ఎ మిలాదున్ నబీ సెప్టెంబర్ 5, శుక్రవారం జరుపుకుంటారు. రబీ ఉల్ అవ్వల్ 1447 AH/2025 నెలవంక కనిపించినట్లు మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ (మూన్ సైటింగ్ కమిటీ), మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డక్కన్ ప్రకటించింది. రబీ ఉల్ అవ్వల్ ఆగస్టు 25 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే.. భారత్‌పై భారీ సుంకాలు! అమెరికా వింత వాదన
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై రెండోసారి సుంకాలు విధించిందని ప్రకటించారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సుంకాలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై రెండోసారి సుంకాలు ప్రయోగించారని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఆదివారం అన్నారు. వాన్స్ మాట్లాడుతూ.. ఈ చర్యలు రష్యాకు చమురు …
Read More »పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!
రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్ చేసి, తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. నమస్తే రైతన్నలూ.. ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రైతులందరూ మద్దతు ధర అందుకునేందుకు… కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… కపాస్ కిసాన్ …
Read More »శ్రీశైలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. అక్కడి నుంచి డైరెక్ట్‌గా బస్సులు
ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ పలు పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులను నడుపుతోంది. అంతేకాకుండా నేరుగా బస్సులను బుక్ చేసుకునే వారికి ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి శుభవార్త అందించింది తెలంగాణ ఆర్టీసీ. భక్తుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో …
Read More »సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు.. కీలక అంశాలపై చర్చ!
సినీ పరిశ్రమకు పూర్తిగా సహకారం అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. కానీ పరిశ్రమను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని తనను కలిసిన నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని.. కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పలువురు టాలీవుడ్ నిర్మాతలు. ఇటీవల జరిగిన టాలీవుడ్ సమ్మె కారణంగా చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు తలెత్తాయి. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు, …
Read More »ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ తెలుసుకుందామా. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య కొనసాగుతోంది, ఇది ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంది.దీని ప్రభావంతో, రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal